ఆస్తి కోసం తల్లిదండ్రులను ఘోరంగా మోసం చేసిన యువతి

By telugu news teamFirst Published Mar 13, 2021, 8:36 AM IST
Highlights

ఆస్తి తనకు రాసేసిన తర్వాత వారిని వదిలేసింది. కన్న కూతురు అంత దారుణ మోసం చేస్తుందని ఊహించలేకపోయిన ఆ వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు.

వృద్ధాప్యానికి చేరుకున్న తల్లిదండ్రులను పసిబిడ్డలుగా చూడాల్సింది పోయి దారుణంగా ప్రవర్తించింది. బాగా చూసుకుంటానని నమ్మించి.. ప్రేమ కురింపించి వారి వద్ద ఉన్న ఆస్తి మొత్తం రాయించుకుంది. ఆస్తి తనకు రాసేసిన తర్వాత వారిని వదిలేసింది. కన్న కూతురు అంత దారుణ మోసం చేస్తుందని ఊహించలేకపోయిన ఆ వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన పెడనలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

స్థానిక బ్రహ్మపురం 21వ వార్డుకు చెందిన కొండ బ్రహ్మానందం(70) తన భార్యతో కలిసి జీవిస్తున్నారు. వృద్ధాప్యానికి దగ్గరైన వీరిని తానే చూసుకుంటానంటూ ఏలూరులో నివాసం ఉంటున్న కూతురు లక్ష్మీ భరోసా ఇచ్చింది. ఆమె మాటలు నమ్మిన దంపతులు.. వారి వద్ద ఉన్న 473 చదరపు గజాల స్థలాన్ని కూతురి పేరు మీద రాశారు.

అంతే.. ఇక అప్పటి నుంచి వారిని పట్టించుకోవడం మానేసింది. దీంతో బ్రహ్మానందం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు సీనియర్ సిటిజన్ చట్టం 2007 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ చట్టం కింద అక్కడ ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

click me!