కాకినాడ రమేష్ కార్పోరేటర్ హత్య కేసు: ఇద్దరి అరెస్ట్

Published : Feb 15, 2021, 07:21 PM IST
కాకినాడ రమేష్ కార్పోరేటర్ హత్య కేసు: ఇద్దరి అరెస్ట్

సారాంశం

: వైఎస్ఆర్‌సీపీ కార్పోరేటర్ రమేష్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. 


కాకినాడ: వైఎస్ఆర్‌సీపీ కార్పోరేటర్ రమేష్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. 

ఈ నెల 11వ తేదీ రాత్రి కాకినాడ కార్పోరేటర్ రమేష్  హత్యకు గురయ్యాడు. తొలుత రమేష్ ప్రమాదంలో మరణించినట్టుగా భావించారు. కానీ సంఘటన స్థలంలోని సీసీటీవీ పుటేజీ దృశ్యాలను పరిశీలిస్తే కార్పోరేటర్ రమేష్ ను హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

చిన్నా అలియాస్ గురజాల సత్యనారాయణను పిఠాపురం వద్ద అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.  చిన్నాతో పాటు  మరొకరిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను మీడియాకు చూపడం లేదని డీఎస్పీ చెప్పారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగించాల్సి ఉందని ఆయన తెలిపారు.

రమేష్ హత్య చేయడానికి గల కారణాలను పోలీసులు  దర్యాప్తులో తేల్చనున్నారు. ఈ మేరకు  నిందితులను పోలీసులు విచారించనున్నారు. ఆర్ధిక వివాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ విషయాలను పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్