
అనంతపురం: హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తే తగిన బుద్ది చెబుతామని సినీ నటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు.అనంతపురం జిల్లా హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు సోమవారం నాడు బాలకృష్ణ వచ్చారు.
నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నం చేసిన టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని బాలకృష్ణ పరామర్శించారు. బెంగుళూరు నుండి హిందుపురం నియోజకవర్గానికి వచ్చిన బాలకృష్ణకు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
బాలకృష్ణపై టీడీపీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. ముదిరెడ్డిపల్లెలో బాలకృష్ణకు ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని ఆయన చెప్పారు. ఇతర హక్కులను ఎవరూ కూడ కాలరాయవద్దని ఆయన కోరారు. అలా చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన తేల్చి చెప్పారు.