కరివేపాకు పొడి, హెర్బల్ పౌడర్ ల పేరుతో .. అమెజాన్ యాప్ తో గంజాయి స్మగ్లింగ్.. నలుగురు అరెస్ట్

By AN Telugu  |  First Published Nov 24, 2021, 2:38 PM IST

కరివేపాకు పొడి,  హెర్బల్ పౌడర్ ల పేరుతో  అమెజాన్ పికప్ బాయ్స్ సహకారంతో  గంజాయిని విశాఖ నుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.  శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు చేసి అమెజాన్ స్టిక్కర్లు, ప్యాకింగ్ మెటీరియల్ తో పాటు కొంత గంజాయిని సీజ్ చేశారు.  పట్టుబడిన నలుగురు నిందితులు విశాఖలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్టోర్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఎస్ఈబీ  అధికారులు తెలిపారు. 


విశాఖపట్నం : విశాఖ కేంద్రంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ’ద్వారా ఆన్లైన్లో గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్లు మధ్యప్రదేశ్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ మేరకు నగరానికి  వచ్చి గంజాయిని సరఫరా చేసే  శ్రీనివాస్ అనే వ్యక్తితో పాటు Amazon Pick Up Boys కుమారస్వామి, కృష్ణంరాజు, వెంకటరమణను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు విశాఖలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ నెల 13న మధ్యప్రదేశ్ లోని Gwalior సమీపంలో ఓ దాబా లో Marijuana పట్టుబడటంతో  పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా  విశాఖ నుంచి  
Amazon App ద్వారా  గంజాయి అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. విశాఖ నుంచి వచ్చిన గంజాయిని పికప్ చేసుకునే ముగ్గురుని Madhya Pradesh లోని బెండీ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఆ కేసులో భాగంగా విచారణ నిమిత్తం  మధ్యప్రదేశ్ పోలీసులు ఇవాళ విశాఖ చేరుకున్నారు.

Latest Videos

undefined

వీరితో పాటు SEB officials కూడా రంగంలోకి దిగారు.  కరివేపాకు పొడి,  హెర్బల్ పౌడర్ ల పేరుతో  అమెజాన్ పికప్ బాయ్స్ సహకారంతో  గంజాయిని విశాఖ నుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.  శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు చేసి అమెజాన్ స్టిక్కర్లు, ప్యాకింగ్ మెటీరియల్ తో పాటు కొంత గంజాయిని సీజ్ చేశారు.  పట్టుబడిన నలుగురు నిందితులు విశాఖలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్టోర్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఎస్ఈబీ  అధికారులు తెలిపారు. 

నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు,ప్రజల దృష్టి మరల్చేందుకే...: మూడు రాజధానుల చట్టం విత్‌డ్రా పై లోకేష్

ఇదిలా ఉండగా, ఈ నెల మొదట్లో విశాఖ జిల్లాలో గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్న అధికారులను గిరిజన మహిళలు అడ్డుకున్నారు. దాంతో అక్కడ భారీగా police బలగాలు మోహరించాయి. స్థానిక గిరిజన మహిళలతో పోలీసు అధికారుల బృందం చర్చలు జరిపారు. గంజాయి పెంపకంతో ఆధారపడి ఉన్న తమకు ఈ ఏడాది గంజాయి సాగుకు అవకాశం ఇవ్వాలని అధికారులను గిరిజనులు వేడుకున్నారు.

ఒకవేళ ఈ ఏడాది గంజాయి తోటలను ధ్వంసం చేస్తామంటే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, ఒక బృందం అధికారులు గిరిజన మహిళలతో చర్చలు జరుపుతుండగా మరో బృందం గంజాయి సాగును ధ్వంసం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Visakhapatnam ఏజెన్సీలో గంజాయిని తోటలను ధ్వంసం చేసే పనిని పోలీసులు, Excise అధికారులు చేపట్టారు. అయితే కొన్ని రోజులుగా ఈ ప్రాంతానికి చెందిన గిరిజనులు సహకరిస్తున్నారు. కానీ ఇవాళ మాత్రం గిరిజనులు సహకరించలేదు. పోలీసులపై దాడులకు దిగారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. 

బుధవారం నాడు విశాఖపట్నంలోని జి.మాడుగుల మండలం బొయితిలి పరిసర ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లారు. గంజాయి తోటలను గిరిజనులు అడ్డుకొన్నారు. దేశంలోని ఎక్కడ గంజాయి దొరికినా కూడ ఏపీ రాష్ట్రంతో లింకులుంటున్నాయని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. 

దీంతో గంజాయి రవాణాను అడ్డుకొనేందుకు ఇతర రాష్ట్రాల పోలీస్ అధికారులతో ఏపీ డీజీపీ సవాంగ్ ఇటీవలనే విశాఖలో సమావేశం నిర్వహించారు. గంజాయి సాగు, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది  జగన్ సర్కార్. గంజాయి కనిపిస్తే చాలు కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు.. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గంజాయిని ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టారు. 

click me!