తల్లిని సంతోషపెట్టాలని.. నకిలీ పోలీసు అవతారం.. చివరకు..

By telugu news teamFirst Published Aug 2, 2021, 8:14 AM IST
Highlights

కొడుకు పోలీసు అవ్వాలని కలలు కన్నది. పృథ్వరాజ్ 2017లొ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి వెళ్లగా.. సెలక్ట్ కాలేదు. తల్లి బాధపడుతుందని.. తనకు విజయవాడలో ఉద్యోగం వచ్చిందని నమ్మించాడు.

కొడుకు ప్రయోజకుడవ్వాలని ప్రతి తల్లి ఆశపడుతుంది. ఆమె కూడా తన కొడుకు పోలీసు అవ్వాలని అనుకుంది. తల్లి కోరిక నిజంగా తీర్చలేకపోయిన ఆ కొడుకు... తల్లిని సంతోషపెట్టడానికి తాను పోలీసునని నమ్మించాడు. పోలీసు యూనిఫాం కొనుక్కోని.. దానిని వేసుకొని తల్లికి కనిపించాడు. ఈ క్రమంలో నిజమైన పోలీసులకు చిక్కి.. కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన విజయవాడ సమీపంలోని పాయకాపురంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తోట్లవల్లూరు మండలం రొయ్యూరుకు చెందిన లుక్కా పృథ్వరాజ్ బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. తండ్రి లేకపోవడంతో తల్లి చాలా కష్టపడి అతనిని పెంచి పెద్ద చేసింది. కొడుకు పోలీసు అవ్వాలని కలలు కన్నది. పృథ్వరాజ్ 2017లొ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి వెళ్లగా.. సెలక్ట్ కాలేదు. తల్లి బాధపడుతుందని.. తనకు విజయవాడలో ఉద్యోగం వచ్చిందని నమ్మించాడు.

ఓ యూనిఫాం కొనుగోలు చేసి.. దానిని వేసుకొని తిరగడం మొదలుపెట్టాడు. అందరూ.. అతనిని నిజమైన పోలీసు అనే అనుకున్నారు. శిక్షణ పేరిట కొద్ది రోజులు ఇంటికి దూరంగా ఉంటూ.. కోళ్ల ఫారాంలో పనిచేయడం మొదలుపెట్టాడు. ఇతని తీరు అనుమానంగా ఉండటంతో.. కొందుకు పోలీసులకు ఫిర్యాదు  చేశారు. దీంతో.. అతని గుట్టు బయటకు వచ్చింది.

తాను ఈ  యూనిఫాం వేసుకొని ఎలాంటి దుర్వినియోగం చేయలేదని..కేవలం తన తల్లిని సోంతోష పెట్టానని అతను చెప్పడం గమనార్హం. 

click me!