తూ.గోలో మళ్లీ 400 దాటిన రోజువారీ కేసులు.. ఏపీలో 19,65,567కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Aug 01, 2021, 05:58 PM IST
తూ.గోలో మళ్లీ 400 దాటిన రోజువారీ కేసులు.. ఏపీలో 19,65,567కి చేరిన సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 2,287 కరోనా కేసులు నమోదవ్వగా.. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 2,430 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 21,019 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు  స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,287 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,65,567కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,395కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 2, చిత్తూరు 4, ప్రకాశం 2, కృష్ణ 3, గుంటూరు 1, కర్నూలు 1, విశాఖపట్నం 1, శ్రీకాకుళం 1, నెల్లూరులో ముగ్గురు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 2,430 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,31,153కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 85,856 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,46,48,899కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 21,019 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 59, చిత్తూరు 377, తూర్పుగోదావరి 410, గుంటూరు 231, కడప 125, కృష్ణ 299, కర్నూలు 48, నెల్లూరు 187 ప్రకాశం 185, శ్రీకాకుళం 45, విశాఖపట్నం 170, విజయనగరం 28, పశ్చిమ గోదావరిలలో 123 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు