అక్రమాస్తుల కేసు: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

Siva Kodati |  
Published : Jul 01, 2021, 06:29 PM ISTUpdated : Jul 01, 2021, 06:30 PM IST
అక్రమాస్తుల కేసు: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

సారాంశం

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో గురువారం విచారణ జరిగింది. రఘురామ దాఖలు చేసిన రిజాయిండర్‌పై లిఖితపూర్వక సమాధానం ఇస్తానన్న జగన్‌ అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది.  

పిటిషన్‌ వేసినందున తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని రఘురామ తరఫు న్యాయవాది శ్రీవెంకటేశ్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. కేసులో సాక్షులుగా ఉన్న అధికారులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రలోభ పెడుతున్నారని ఆయన వాదించారు. ఇతర నిందితులకూ ప్రయోజనాలు కల్పిస్తున్నారని కోర్టుకు వివరించారు. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ అభిప్రాయం వెల్లడించకపోవడం సరికాదని రఘురామ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

Also Read:జగన్ బెయిల్ రద్దు కోరాననే....: ఓం బిర్లాకు రఘురామ కృష్ణం రాజు ఫిర్యాదు

జగన్‌, రఘురామ వాదనల తర్వాత  లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని సీబీఐ... కోర్టుకు తెలిపింది. రఘురామకు పిటిషన్‌ వేసే అర్హత లేదని జగన్‌ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. రాజకీయ ఉద్దేశాలతోనే పిటిషన్‌ వేశారని వాదించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. జగన్‌, రఘురామ, సీబీఐ లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.  
 
PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?