బద్వేల్ లో నకిలీ పట్టాలతో భూ దందా: 17 మంది అరెస్ట్

Published : May 16, 2022, 03:40 PM IST
బద్వేల్ లో నకిలీ పట్టాలతో భూ దందా: 17 మంది అరెస్ట్

సారాంశం

ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేల్ లో నకిలీ భూ పట్టాలతో దందా నిర్వహించిన 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నకిలీ పట్టాలతో భూ దందాను నిర్వహించారు.


కడప: ఉమ్మడి Kadapa జిల్లాలోని  Badvel లో నకిలీ భూ పట్టాలతో దందా నిర్వహించిన 17 మంది ముఠాను Police సోమవారం నాడు Arrest చేశారు.   నకిలీ భూమి పట్టా సర్టిపికెట్లతో భూ దందాను నిర్వహించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో Battina Ravi Shankar సహా 17 మందిని అరెస్ట్ చేశారు.  నకిలీ పట్టా సర్టిఫికెట్లతో  వందల కోట్ల భూ అక్రమాలకు ఈ ముఠా పాల్పడిందని పోలీసులు గుర్తించారు. నిందితుల నుండి నకిలీ పట్టాలతో పాటు, నకిలీ పట్టాలు తయారీ  కోసం ుపయోగించిన పరికరాలను కూడా పోలీసులు సీజ్ చేశారు.

గతంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తరహాలో నకిలీ పట్టారు పాస్తు పుస్తకాలతో వందల కోట్ల రూపాయాల భూ మాఫియా జరిగిన కేసులు నమోదయ్యాయి.ఈ ఏడాది మార్చి మాసంలో కూడా ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని ఆలూరులో అక్రమ పాస్ పుస్తకాలతో భూ దందాను అధికారులు గుర్తించారు. నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలను బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకున్నారు.ఈ విషయం వెలుగు చూడడంతో ముగ్గురిపై ప్రభుత్వం వేటేసింది. 

also read:ఆలూరులో రెవిన్యూ అధికారుల లీలలు: భూమి లేకున్నా పట్టాదారు పుస్తకాలు జారీ

Kurnool  జిల్లా ఆలూరు మండలంలో భూమి లేకున్నా కూడా పట్టాదారు పాస్తు పుస్తకాలు  జారీ చేశారు.ఎలాంటి భూమి లేకున్నా కూడా ఐదు వేల ఎకరాలకు పాస్ పుస్తకాలు జారీ చేశారు.ఆలూరు  మండలంలోని మొలగపల్లి గ్రామంలో 864 ఎఫ్, 894 డీ సర్వే నెంబర్లు లేవు. అయితే  ఈ గ్రామంలో సర్వే నెంబర్లపై  పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు.

ఈ ఘటనకు సంబంధించి ఆలూరు తహసీల్దార్ హుస్సేన్ సాబ్, వీఆర్వో సూరి సస్పెండ్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సెంటు భూమి లేకున్నా కూడా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయడంపై  ఇటీవలనే  ఆర్డీఓ   విచారణ నిర్వహించారు. ఈ పట్టాదారు పాస్తు పుస్తకాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకొన్నారు.

అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తికి పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేశారు. అంతేకాదు ఈ సర్వే నెంబర్లను ఆన్‌లైన్ లో కూడా నమోదు చేశారు. ఈ పాస్ పుస్తకాన్నిబ్యాంకులో తనఖా పెట్టి చంద్రశేఖర్ రూ. 20 లక్షలు అప్పుగా తీసుకొన్నాడు. 

అయితే గ్రామంలో ఈ సర్వే నెంబర్ లో భూములు లేకున్నా కూడా ఆ నెంబర్లను ఆన్ లైన్ లో కూడా నమోదు చేయడంపై ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున తాము ఈ సర్వే నెంబర్లను ఆన్ లైన్‌లో నమోదు చేశామని చెబుతున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆర్డీఓ విచారణ చేపట్టారు.  

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే