రంపచోడవరంలో భారీగా గంజాయి పట్టివేత.. పోలీసులు వెంబడించడంతో జలాశయంలోకి దూసుకెళ్లిన కారు..

By Sumanth KanukulaFirst Published May 16, 2022, 2:06 PM IST
Highlights

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు వెంబడించడంతో.. గంజాయి తరలిస్తున్న ముఠా కారు భూపాతిపాలెం జలాశయంలోకి దూసుకెళ్లింది. 

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు వెంబడించడంతో.. గంజాయి తరలిస్తున్న ముఠా కారు భూపాతిపాలెం జలాశయంలోకి దూసుకెళ్లింది. వివరాలు.. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమారంతో పోలీసులు సోదాలు చేపట్టారు. మైదాన ప్రాంతం రహదారిపైకి వస్తున్న గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు గుర్తించారు. కారును గుర్తించిన పోలీసులు.. దానిని వెంబడించారు. ఇది గమనించిన కారులో గంజాయి ముఠా.. వాహనాన్ని వేగంగా నడిపారు. ఈ క్రమంలోనే వాహనం అదుపుతప్పి భూపతిపాలెం వద్ద జలాశయంలోకి దూసుకెళ్లింది. 

అయితే కారు జలాయశంలోకి పడిన తర్వాత అందులో ఓ వ్యక్తి పారిపోయాడు. మరో వ్యక్తికి గాయాలు కావడంతో అతడు కారులోనే ఉండిపోయాడు. దీంతో పోలీసులు కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారులోని దాదాపు 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. క్రేన్ సాయంతో జలాశయంలో పడిన కారును బయటకు తీశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పారిపోయిన మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. 
 

click me!