పల్నాడు జిల్లాలో విషాదం.. ఎద్దుల బండి నీటి కుంటలో పడి తండ్రీకొడుకుల మృతి

By Sumanth KanukulaFirst Published May 16, 2022, 3:29 PM IST
Highlights

పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం గంగిరెడ్డిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఎద్దుల బండి నీటి కుంటలో బోల్తా పడిన ఘటనలో తండ్రీకొడుకులు మృతిచెందారు.

పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం గంగిరెడ్డిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఎద్దుల బండి నీటి కుంటలో బోల్తా పడిన ఘటనలో తండ్రీకొడుకులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఎద్దులు కూడా మృతిచెందాయి. మృతులను తండ్రి నాగరాజు, అతని కుమారుడు చరణ్‌గా గుర్తించారు. ఈ ఘటన నాగరాజు కుటుంబంతో పాటు స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. 

నాగరాజు తన తొమ్మిదేళ్ల కొడుకు చరణ్‌తో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా వారి ఎడ్ల బండి గట్టుపై నుంచి నీటి కుంటలో పడింది. దీనిని గమనించిన స్థానికులు తండ్రీకొడుకులను  కాపాడేందుకు యత్నించారు. అయితే ఆలోపే వారిద్దరు నీటిలో మునిగి మృతిచెందారు. మరోవైపు ఈ ఘటనలో ఎద్దులు కూడా మృతిచెందాయి.

అనంతరం వారి మృతదేహాలను స్థానికుల బయటకు తీశారు. అలాగే మృతిచెందిన ఎడ్లను కూడా నీటి కుంటలో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇక, నాగరాజు, చరణ్‌ల మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

click me!