
పోలవరం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు తీవ్ర అసహనం వ్యక్తం చేసారట...ఏంటి నిజమే. పనులు జరుగుతున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారట. పనులు అనుకున్నంత వేగంగా సాగటం లేదట. ఇదంతా నిజమేనని అనుకోవాలా? ఎందుకంటే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు భుజాని కెత్తుకున్నది ప్రాన్స్ టాయ్ సంస్ధ. సదరు సంస్ధ టిడిపికి చెందిన నరసరావు పేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావుది. ఆది నుండి ఆ సంస్ధ వ్యవహారాలు పూర్తిగా వివాదాస్పదమే. ఈ విషయం 40 ఇయర్స్ ఇండస్ట్రి చంద్రబాబుకు తెలీనిదేమీ కాదు.
ఎందుకంటే, కాకినాడ, రాజమండ్రి మధ్య ఉన్న 65 కిలోమీటర్ల జాతీయ రహదారిని వేయటానికి ట్రాన్స్ టాయ్ నానా అవస్తలు పడుతున్నది. ఈ రహదారి నిర్మాణ పనులు పూర్తిగా ప్రపంచబ్యాంకు నిధిలతోనే జరుగుతున్నది. రహదారి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు నిర్దేశించిన గడువు ఎప్పుడో అయిపోయినా ఇప్పటికి అయిన పనులు కేవలం 10 శాతం కూడా లేదు. అందుకనే ప్రపంచబ్యాంకు నిర్మాణ సంస్ధపై నిషేధం విధించింది. ఫలితంగానే రహదారి నిర్మాణానికి మంజూరు చేయాల్సిన నిధులను కూడా నిలిపి వేసింది. ఈ విషయాలేవీ చంద్రబాబుకు తెలీనివి కావు.
అయినా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే పోలవరం నిర్మాణ బాధ్యతలను మళ్ళీ అదే సంస్ధకు చంద్రబాబు కట్ట బెట్టారు. తాము బ్లాక్లిస్టులో పెట్టిన నిర్మాణ సంస్ధకు పోలవరం నిర్మాణ బాధ్యతలు ఏ విధంగా అప్పచెబుతారని ప్రపంచబ్యాంకు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అయినా ప్రభుత్వం సదరు సంస్ధను పక్కకు తప్పించ లేదు.
ఎందుకంటే, పోలవరం నిర్మాణానికి కూడా ప్రపంచబ్యాంకు నిధులు సమకూరుస్తోంది. అందినకాడికి నిధులను అందుకోవటం, పనులను నత్తకన్నా కనాకష్టంగా చేపట్టటంలో ట్రాన్స్ టాయ్ కు ఘనమైన రికార్డే ఉంది. మరి అటువంటి సంస్ధ చేతిలో నిర్మాణ బాధ్యతలు పెట్టిన తర్వాత ఇపుడు చంద్రబాబు పనుల పురోగతిపై అసహనం వ్యక్తం చేయటమంటే ఆలోచించాల్సిందే. పైగా పోలవరం పనుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష చేయటం మొదటిసారి కాదూ, పనులు వేగంగా .జరగకపోవటానికి సంస్ధ ఏవో కారణాలు చెప్పటమూ కొత్తకాదు.
గతంలో కూడా చాలా సార్లే చంద్రబాబు పనులు జరుగుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేసారు. అనుకున్నట్లు వేగంగా పనులను చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఎన్నోమార్లు చంద్రబాబే ఉన్నతాధికారులను ఆదేశించారు.అయినా ఇంత వరకూ ట్రాన్స్ టాయ్ ను బ్లాక్ల్ లిస్టులో పెట్టింది లేదు...ఆ సంస్ధ పనులను వేగంగా చేసిందీ లేదు..మరి పనులపై సమీక్ష సందర్భంలో ఉన్నతాధికారులపై మండిపడటం ఏమిటో చంద్రబాబుకే తెలియాలి.