ప్రధాని నరేంద్ర మోడీ తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మోడీ రోడ్డు మార్గం గుండా రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఈ రాత్రికి ప్రధాని తిరుమలలోనే బస చేయనున్నారు. సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
మోడీ పర్యటన నేపథ్యంలో తిరుమల, తిరుపతిలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనానంతరం మోడీ రేణిగుంట నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. సోమవారం నగరంలో జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొంటారు.
undefined
ALso Read: Narendra Modi...కొడుకును సీఎం చేసేందుకు కేసీఆర్ ఆరాటం: నిర్మల్ సభలో మోడీ
కాగా.. శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన సాయంత్రం మోడీ తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారని.. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారని… 27వ తేదీ ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని సీఎస్ తెలిపారు.
దర్శనానంతరం తిరుపతి నుంచి మళ్లీ హైదరాబాదుకు బయలుదేరి వెళ్తారని.. ఈ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వివిఐపి పర్యటన నిబంధన ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేసినట్లుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సిఎస్ సూచించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా..అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సీఎస్ ఆదేశించారు.