PM Modi Ex Gratia: ఆ ప్ర‌మాదం చాలా బాధ‌క‌రం.. బాధిత కుటుంబానికి ప్ర‌ధాని న‌ష్ట‌ప‌రిహారం.

Published : Dec 15, 2021, 10:19 PM IST
PM Modi  Ex Gratia: ఆ ప్ర‌మాదం చాలా బాధ‌క‌రం.. బాధిత కుటుంబానికి ప్ర‌ధాని న‌ష్ట‌ప‌రిహారం.

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లాలోని  జంగారెడ్డిగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి.. జల్లేరు వాగులో పడిపోయింది. ఈ రోడ్డు ప్రమాదంలో 9 మంది మ‌ర‌ణించారు. ప‌లువురికి గాయాల‌య్యాయి. ఈ ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోడీ స్పందించారు.  ఈ ఘటన బాధ కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ప్రధాని కార్యాలయం పరిహారం ప్రకటించింది.    

PM Modi  Ex Gratia: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జ‌రిగింది.  జంగారెడ్డిగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి.. జల్లేరు వాగులో పడిపోయింది. ఈ రోడ్డు ప్రమాదంలో 9 మంది మ‌ర‌ణించారు.   8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదస్థలిలోనే బస్సు డ్రైవర్ దుర్గారావు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. 

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో జిల్లా అధికార యంత్రాంగం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ దుర్గారావు, ద్వారకా తిరుమలకు చెందిన సరోజిని, తాడువాయికి చెందిన దుర్గమ్మ, నందిగూడెంకు చెందిన సత్యవతి, ఏ. పోలవరానికి చెందిన బుల్లెమ్మ, కేత మహాలక్ష్మి, గంగవరానికి చెందిన జాన్‌, ప్రసాద్‌, చిన్నంవారిగూడెంకు చెందిన మధుబాబు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.

Read also:    West Godavari Bus Accident : బస్సు పర్ఫెక్ట్.. మానవ తప్పిదమే వల్లే ప్రమాదం : అధికారులు

పలువురి సంతాపం..  

ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద ఘటన బాధ కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ప్రధాని కార్యాలయం పరిహారం ప్రకటించింది.  మృతులు కుటుంబాలకు పీఎంఎన్ఆర్ ఎఫ్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని అందించనున్నారు.

Read also:    రెచ్చగొట్టి ఆరోపణలు చేయిస్తున్నారు: రెబెల్స్ పై రోజా ఫైర్

బస్సు ప్రమాద ఘటన అత్యంత విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం జగన్ సంతాపం తెలియజేశారు. బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.అలాగే .. ఏపీఎస్ ఆర్టీసీ కూడా ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల‌కు  రూ. 2.5 లక్షల చొప్పున పరిహారాన్ని అందిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ ద్వారాక తిరుమల రావు ప్రకటించారు.

Read Also: చంద్రబాబు రసం పీల్చే పురుగు.. అందుకే 2019లో మందు కొట్టారు: కన్నబాబు సెటైర్లు

 ఏపీ 37జెడ్ 193 గ‌ల ఆర్టీసీ బస్సు జంగారెడ్డిగూడెం డిపోకు చెందినది. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డి‌గూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం జ‌రిగింది. వంతెన రెయిలింగ్‌ను ఢీకొని బస్సు వాగులో బోల్తా పడింది. దాదాపు 50 అడుగుల లోతులో ప‌డింది. ఈ ప్ర‌మాదం లో  9 మంది చ‌నిపోగా. ప‌లువురికి గాయాలయ్యాయి. దాదాపు మూడు గంట‌ల పాటు శ్ర‌మించి..  జల్లేరువాగులో నుంచి బ‌స్సును బ‌య‌ట‌కు తీశారు. ప్రమాదానికి గురైన బస్సు లో ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌నీ, ఆ బ‌స్సు కొత్త‌ద‌ని డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాస్ చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

నేను మారాను నన్ను నమ్మండి అనడం చంద్రబాబు కి అలవాటే: Perni Nani Comments | YCP | Asianet News Telugu
మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu