పీఆర్‌సీ నివేదికకు (prc report) సంబంధించి సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం నిర్వహించిన సమావేశం ముగిసింది. పెంచిన జీతాలను 2018 జులై నుంచి వర్తించజేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పీఆర్‌సీ సహా 71 డిమాండ్లపై సమీక్ష నిర్వహించారు.
పీఆర్‌సీ నివేదికకు (prc report) సంబంధించి సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం నిర్వహించిన సమావేశం ముగిసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ (buggana rajendranath reddy ) నేతృత్వంలో సమావేశం జరిగింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి (sajjala rama krishna reddy) , ఆర్థిక శాఖ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. జీతాల పెంపు అమలు తేదీలపైనా సమావేశంలో చర్చ జరిగింది. పెంచిన జీతాలను 2018 జులై నుంచి వర్తించజేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పీఆర్‌సీ సహా 71 డిమాండ్లపై సమీక్ష నిర్వహించారు.
అనంతరం సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి (venkatrami reddy) మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మేరకు పీఆర్‌సీ కమిటీ హెచ్‌ఆర్‌ఏపై సిపార్సు చేసిందన్నారు. 14.29 శాతం ఫిట్‌మెంట్ అంగీకరించబోమని ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పామని.. కనీసం 34 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. హెచ్‌ఆర్‌ఏ విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని కోరామని... తెలంగాణలోనూ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ సిఫార్సు చేశారని ఆయన గుర్తుచేశారు. కేంద్ర హెచ్‌ఆర్‌ను చాలా రాష్ట్రాలు అమలు చేయడం లేదని... పీఆర్‌సీ నివేదికలోని చాలా అంశాలపై అంగీకరించబోయేది లేదని తేల్చి చెప్పామని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.
మెడికల్ రీయింబర్స్‌మెంట్ రూ.10 లక్షలకు పెంచాలని, గ్రాట్యుటీ రూ.18 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈహెచ్‌ఎస్ పూర్తిగా ఇవ్వాలని సూచించామని.. పీఆర్‌సీ నివేదిక ఇవ్వకున్నా ఇబ్బంది లేదని ఆయన పేర్కొన్నారు. పూర్తి అంశాలు తెలుసుకోవాలంటే నివేదిక కావాలని... పీఆర్‌సీ కమిషన్ సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని కోరామని వెంకట్రామిరెడ్డి వివరించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని.. ఈ విషయాన్ని సీఎం వద్ద త్వరగా తేల్చాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనను కోరాం అని ఆయన తెలిపారు.
Also Read:45 శాతం సాధ్యం కాదు.. సీఎస్ కమిటీ సిఫారసు అదే : పీఆర్‌సీపై సజ్జల రామకృష్ణారెడ్డి
మరోనేత సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆర్థిక పరమైనటువంటి 21 ప్రధాన అంశాలపై ఇవాళ భేటీలో చర్చించారని ఆయన తెలిపారు. పీఆర్‌సీ కమిటీ ఇచ్చిన నివేదికపై అంశాల వారీగా చర్చించామని.. ఈ 21 అంశాల్లో ఫిట్‌మెంట్ ఒకటని సూర్యనారాయణ పేర్కొన్నారు. కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదిక అర్థరహితంగా ఉందని.. దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు.
పీఆర్‌సీ నివేదిక మాత్రమే చర్చలకు ప్రాధాన్యం కావాలని కోరామని.. సీఎస్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక ఎందుకు శాస్త్రీయంగా లేదో ఆధారాలతో ప్రభుత్వానికి వివరించామని సూర్యనారాయణ వెల్లడించారు. 20 అంశాలపై అన్ని సంఘాలు ఒకే తాటిపై నిలబడ్డాయని.. హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి హెచ్‌ఆర్‌ఏ తొలగింపు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్‌లకు రూ.40 వేలు అద్దె భత్యం ఇస్తున్నారని.. పీఆర్‌సీ వివాదానికి సోమవారం నాటికి తెరపడుతుందని సూర్యనారాయణ ఆకాంక్షించారు.