జగన్‌తో ముగిసిన భేటీ: వేణు పై పిల్లి ఫిర్యాదు, మీడియా కంటపడకుండా వెళ్లిపోయిన ఎంపీ

By narsimha lode  |  First Published Jul 18, 2023, 2:52 PM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో  పిల్లి సుభాష్ చంద్రబోస్ సమావేశం  ముగిసింది.  సమావేశం ముగిసిన తర్వాత  మీడియా కంటపడకుండా పిల్లి సుభాస్ చంద్రబోస్ సీఎం కార్యాలయం నుండి వెళ్లిపోయారు.


అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ తో  ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్  సమావేశం  ముగిసింది.  జగన్ ఆహ్వానం మేరకు మంగళవారంనాడు ఉదయం తాడేపల్లికి చేరుకున్నారు  పిల్లి సుభాష్ చంద్రబోస్. సీఎం జగన్ తో ఆయన సమావేశమయ్యారు. రామచంద్రాపురంలో  చోటు  చేసుకున్న పరిణామాలపై  జగన్ కు  పిల్లి సుభాష్ చంద్రబోస్ వివరించారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్  తీరుపై  ఫిర్యాదు చేశారు. రామచంద్రాపురంలో వచ్చే ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయాన్ని పార్టీ అధినాయకత్వానికి వదిలేయాలని  సీఎం జగన్ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు సూచించారని సమాచారం.  ఏదైనా ఇబ్బందులుంటే  తన దృష్టికి తీసుకురావాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ కు  సీఎం జగన్ సూచించారని తెలుస్తుంది. మరో వైపు ఈ అంశంపై మీడియా వేదికగా  మాట్లాడొద్దని కూడ సూచించారు. రామచంద్రాపురంలో  తన వర్గీయులపై  కేసుల నమోదు అంశాన్ని కూడ  సీఎం వద్ద  పిల్లి సుభాష్ చంద్రబోస్  ప్రస్తావించారని సమాచారం. తాజాగా శివాజీపై దాడితో ఆయన ఆత్మహత్యాయత్నం చేసిన అంశాన్ని కూడ సుభాష్ చంద్రబోస్ కూడ సీఎం దృష్టికి తీసుకువచ్చారనే ప్రచారం సాగుతుంది. 

. సీఎం జగన్ తో  సుమారు  అరగంటకు పైగా  పిల్లి సుభాష్ చంద్రబోస్  సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్  మిథున్ రెడ్డి కూడ పాల్గొన్నారు. సమావేశం పూర్తైన తర్వాత    సీఎం క్యాంప్ కార్యాలయం నుండి మరో మార్గంలో  మీడియా కంటపడకుండా  పిల్లి సుభాష్ చంద్రబోస్, మిథున్ రెడ్డిలు బయటకు వెళ్లారు. మంత్రి వేణుగోపాల్ తో గ్యాప్ పెరగడానికి గల కారణాలపై  ఎంపీ మిథున్ రెడ్డికి ఆయన నివాసంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ వివరించనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుండి మిథున్ రెడ్డి నివాసానికి  పిల్లి సుభాష్ చంద్రబోస్  వెళ్లారు. ఇదిలా ఉంటే  పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సుభాష్ చంద్రబోస్ ఈ సమావేశంలో చెప్పినట్టుగా తెలుస్తుంది.

Latest Videos

undefined

also read:తాడేపల్లికి చేరుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్: వైఎస్ జగన్ తో భేటీ

రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో  వచ్చే ఎన్నికల్లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పోటీ చేస్తారని  వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్  మిథున్ రెడ్డి  ప్రకటించారు.ఈ ప్రకటన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను అసంతృప్తికి గురి చేసింది.

click me!