విశాఖ భూ కుంభకోణంపై కోర్టులో కేసు

First Published Jul 7, 2017, 12:31 PM IST
Highlights

అధికారపార్టీ నేతలు, అధికారులు, పలుకుబడి ఉన్న పెద్దలు కుమ్మకై కుంభకోణానికి తెరతీస్తే సిబిఐతో కాకుండా సిఐడితో విచారణ జరిపించటంలో అర్ధం లేదని పిటీషనర్ పేర్కొన్నారు.

విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణంపై సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ కోర్టులో కేసు దాఖలైంది. విజయవాడ మాజీ ఎంఎల్ఏ అడుసుమిల్లి జయప్రకాశ్ హైకోర్టులో శుక్రవారం కేసు వేసారు. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద భూకుంభకోణంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న కుంభకోణంపై సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నా చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు. అంతపెద్ద భూకుంభకోణం జరిగిందని విపక్షాలతో పాటు బాధితులూ మొత్తుకుంటున్నా చంద్రబాబు మాత్రం సిఐడి విచారణతో సరిపెట్టిన సంగతి తెలిసిందే.

అదే విషయాన్ని అడుసుమిల్లి కోర్టులో ప్రస్తావించారు. అధికారపార్టీ నేతలు, అధికారులు, పలుకుబడి ఉన్న పెద్దలు కుమ్మకై కుంభకోణానికి తెరతీస్తే సిబిఐతో కాకుండా సిఐడితో విచారణ జరిపించటంలో అర్ధం లేదని పిటీషనర్ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లాలోని ల్యాండ్ స్కాం జరిగిన ప్రాంతాలు తదితర వివరాలను పిటీషన్లో పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన కథనాలను కూడా జత చేసారు. సిఐడితో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి సిబిఐతోనే విచారణకు ఆదేశించాలని జమప్రకాశ్ కోర్టును కోరారు.

click me!