రుణమాఫీ చేయటం ఎలా ?

First Published Jul 7, 2017, 9:11 AM IST
Highlights

పోయిన ఎన్నికల్లో అధికారం అందుకోవటమే ఏకైక లక్ష్యంగా ఇచ్చిన అనేక హామీల్లో రైతురుణమాఫీ కూడా ఒకటి. ఇపుడదే చంద్రబాబు మెడకు గుదిబండలాగ తయారైంది. మొదటి రెండు విడతలకే రుణాలు చెల్లించటం, వడ్డీలు కట్టుకోవటం గగనమైంది.

సుమారు 60 ఏళ్ళ క్రితమే ‘అప్పు చేసి పప్పు కూడు’ అనే సినిమా వచ్చింది. అందులో ఓ క్యారెక్టర్ దొరికిన చోటంతా అప్పులు చేస్తూ దర్జా ఒలకబోస్తుంటాడు. అప్ప్పు తెచ్చేటప్పుడు వడ్దీ ఎంత అని చూడడు. అప్పు ఇచ్చే వాడుంటే చాలు వడ్డీ ఎంతైనా సరే అంటాడు. ఇప్పుడిదంతా ఎందుకంటే, చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి పై పోలిక సరిగ్గా సరిపోతుంది. చంద్రబాబుకు చేతనైంది ఏంటంటే అందినకాడికి అప్పులు చేసుకుంటూ పోవటం, వడ్డీలు కట్టుకోవటం.

పోయిన ఎన్నికల్లో అధికారం అందుకోవటమే ఏకైక లక్ష్యంగా ఇచ్చిన అనేక హామీల్లో రైతురుణమాఫీ కూడా ఒకటి. ఇపుడదే చంద్రబాబు మెడకు గుదిబండలాగ తయారైంది. మొదటి రెండు విడతలకే రుణాలు చెల్లించటం, వడ్డీలు కట్టుకోవటం గగనమైంది.

ఇపుడు మూడో విడత చెల్లించాల్సిన సమయం వచ్చింది. దాంతో ఏం చేయాలో అర్ధం కాక అప్పులిచ్చే వాళ్ళు ఎవరున్నారా అని వెతుకుతోంది. రెండు విడతల్లో రూ 11,027 కోట్లు చెల్లించింది. మూడో విడతలో రూ. 3600 కోట్లు చెల్లించాలి. అదే ఇపుడు సమస్యగా మారింది.

అసలే ఖజానా ఖాళీ. దానిపైన మితిమీరిన ఖర్చులు. తాజాగా జిఎస్టీ అమలుతో తగ్గిన ఆదాయం. ఇదేసమయంలో చెల్లించాల్సిన రుణమాఫి. దాంతో ప్రభుత్వ పరిస్ధితి ‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్లైం’ది. మూడో విడత చెల్లింపులకు ఎవరప్పు ఇస్తారా అని వెతికింది.

అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలను సంప్రదించింది. అయితే, ఎక్కడా దొరకలేదు. ఒకవేళ ఇచ్చినా వారికి చెల్లించాల్సిన వడ్డీ చాలా ఎక్కువ. దాంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్ధంకాని పరిస్ధితిల్లో తాజాగా రిజర్వ్ బ్యాంకును సంప్రదించింది. అయితే, రిజర్వ్ బ్యాంకు రుణం ఇవ్వాలన్నా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే ఇస్తుంది. అయితే అప్పులు తెచ్చుకోవటంలో రాష్ట్రం ఎప్ఆర్బిఎం పరిధిని దాటేసింది. దాంతో ఇపుడు ఏం చేయాలో ప్రభుత్వానికి దిక్కుతోచటం లేదు.

click me!