కర్నూల్ జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం: దొంగనోట్లను చించిన యాత్రికులు

By narsimha lodeFirst Published Oct 6, 2021, 1:50 PM IST
Highlights

కర్నూల్ జిల్లా శ్రీశైలంలో దొంగనోట్ల చలామణి కలకలం రేపింది. దొంగనోట్లు ఇచ్చిన యాత్రికులను పట్టుకొని నిలదీశారు పెట్రోల్ బంకు సిబ్బంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కర్నూల్:  కర్నూల్ జిల్లా శ్రీశైలంలో దొంగనోట్ల చలామణి కలకలం రేపుతోంది. పెట్రో‌ల్ బంక్ సిబ్బందికి దొంగనోట్లు ఇచ్చి పెట్రోల్ పోయించుకొన్నారు యాత్రికులు. ఈ విషయాన్ని గుర్తించి పెట్రోల్ బంక్ సిబ్బంది  యాత్రికులను పట్టుకొని నిలదీశారు. దీంతో   నకిలీ నోట్లను చించి  అసలు నోట్లను ఇచ్చి వెళ్లిపోయారు piligrims.

also read:దొంగనోట్ల ముఠాను పట్టిచ్చిన చికెన్ పకోడీ.. యూట్యూబ్ లో చూసి....

బుధవారం నాడు srisailam ఓ పెట్రోల్ బంక్ లో  కారులో వచ్చిన  యాత్రికులు నకిలీ కరెన్సీ ని ఇచ్చి పెట్రోల్ పోయించుకొన్నారు. అయితే  కారులో వచ్చిన యాత్రికులు ఇచ్చిన  fake currency  గుర్తించారు petrol bunk సిబ్బంది. వెంటనే  యాత్రికుల కారును పెట్రోల్ బంకు సిబ్బంది వెంబడించి పట్టుకొన్నారు. యాత్రికులను నకిలీ కరెన్సీ విషయమై నిలదీశారు. దీంతో యాత్రికులు నకిలీ కరెన్సీని చించి  అసలు కరెన్సీని పెట్రోల్ బంక్ సిబ్బందికి అందించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నకిలీ కరెన్సీ యాత్రికులకు ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై  ప్రస్తుతం చర్చకు తారి తీసింది. ఈ విషయమై పోలీసులు దృష్టి సారించారు. పెట్రోల్ బంక్ సిబ్బందికి నకిలీ కరెన్సీని ఇచ్చిన వారెవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 

click me!