పెథాయ్ తుపాను దాటికి ఆరుగురు మృతి....

By Arun Kumar PFirst Published Dec 17, 2018, 2:04 PM IST
Highlights

పెథాయ్ తుపాను తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యక్షంగా...తెలంగాణ లో పరోక్షంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ తుపాను కారుణంగా కురుస్తున్న వర్షాలు, చలిగాలులతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఆరుగురు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా చలికి తట్టుకోలేక వృద్దులు మృత్యువాతపడుతున్నారు. 

తుఫాను ప్రభావం అదికంగా వున్న పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు మృతిచెందారు. నరసాపురంలోని పెదమానిలంక లో ఒకరు, చీరాలలో ఇద్దరు వృద్దులు మృతిచెందారు. వీరు గత రెండు రోజులుగా వీస్తున్న చలిగాలులను తట్టుకోలేక మృతిచెందారు. ప్రకాశం జిల్లా వేటపాలెంలో నిరాశ్రయుడైన ఓ వృద్దుడు రాత్రుళ్లు బస్‌స్టాండ్ లో పడుకునేవాడు. రోజు మాదిరిగానే అతడు రాత్రి చలి తీవ్రత అధికంగా ఉండటంతో తట్టుకోలేక చనిపోయాడు. విశాఖ జిల్లాలో కూడా ఓ వ్యక్తి చనిపోయినట్లు తెలుస్తోంది. 

ఇక తుఫాను కారణంగా తెలంగాణలో కూడా చలి తీవ్రత అధికంగా వుంది. దీంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తగూడెంలో కాశీ అనే వృద్దుడు చలి గాలులకు తట్టుకోలేక మృతిచెందారు.  

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చడంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అలల ఉద్ధృతి పెరిగే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

click me!