పెథాయ్ తుఫానును ఎదుర్కొంటాం.. మంత్రి నారా లోకేష్

By ramya neerukondaFirst Published Dec 17, 2018, 1:13 PM IST
Highlights

 48గంటలపాటు ఏపీని వణికించిన పెథాయ్ తుపాన్ ఈ రోజు తీరం దాటిన సంగతి తెలిసిందే.తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన దగ్గర మధ్యాహ్నం 12గంటల సమయంలో తుఫాను తీరం దాటింది.

పెథాయ్ తుఫానును ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 48గంటలపాటు ఏపీని వణికించిన పెథాయ్ తుపాన్ ఈ రోజు తీరం దాటిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన దగ్గర మధ్యాహ్నం 12గంటల సమయంలో తుఫాను తీరం దాటింది. తుఫాను తీరం దాటినప్పటికీ కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కాగా.. దీనిపై ప్రస్తుత పరిస్థితి గురించి ఏపీ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. తాము తుఫానును ఎదుర్కొంటున్నామని చెప్పారు. పదివేల మందికి పైగా అధికారులు, రెస్పాన్స్ టీమ్ ప్రస్తుత పరిస్థితిని చక్కపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.  ఈ తుఫాను కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించడానికి కృషి చేస్తున్నామన్నారు. 

We are bracing up to face . Response teams and officials numbering more than 10000 are stationed as part of disaster preparedness. Hoping that the loss of life and property will be minimal!

— Lokesh Nara (@naralokesh)

 

click me!