బాబు అఖిలపక్షాన్ని ప్రజాపక్షాలు తిరస్కరించాయి : వైసీపీ నేత పేర్ని నాని

By Nagaraju TFirst Published Jan 30, 2019, 5:23 PM IST
Highlights

బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన చంద్రబాబుకు అఖిల పక్షం ఏర్పాటు చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. పైగా విపక్షాలు హాజరు కాలేదని గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. రాజధాని నిర్మాణం విషయంలో అఖిలపక్షాన్ని పిలిచారా అని నిలదీశారు. 

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న అఖిలపక్ష సమావేశం ఒక డ్రామాగా అభివర్ణించారు వైసీపీ నేత పేర్ని నాని. ప్రజలు చీదరించుకుంటారనే భయంతో అఖిలపక్షం పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. 

బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన చంద్రబాబుకు అఖిల పక్షం ఏర్పాటు చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. పైగా విపక్షాలు హాజరు కాలేదని గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. రాజధాని నిర్మాణం విషయంలో అఖిలపక్షాన్ని పిలిచారా అని నిలదీశారు. 

టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేసిన చోటే చంద్రబాబు రాజధాని ప్రకటించారని గుర్తుచేశారు. ఎవరి సలహాలు తీసుకోకుండా రాష్ట్రాన్ని చీకటిమయం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. వ్యక్తిగత అవసరాల కోసం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో లాలుచీ పడ్డారని ఆరోపించారు.  

టీడీపీ, బీజేపీలు కలిసి రాష్ట్ర ప్రజలను వంచించాయన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలను అందరు గమనిస్తున్నారని అందుకే ప్రజాపక్షాలు చంద్రబాబు అఖిలపక్షాన్ని బహిష్కరించాయని పేర్ని నాని స్పష్టం చేశారు. 

click me!