
కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరద బీభత్సం ముమ్మాటికీ మానవ తప్పిదమేనన్నారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . మంగళవారం కడప జిల్లాలోని (kadapa) వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరి తప్పిదం వల్ల ఈ విపత్తు జరిగిందని ప్రశ్నించారు. వర్షాలను, తుఫాన్‌ను ఎవరూ ఆపలేయని.. కానీ వర్షాల తీవ్రతను గుర్తించాల్సిన భాధ్యత ప్రభుత్వం పై ఉందని చంద్రబాబు హితవు పలికారు. గేట్లు రిపేరు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా అని ఆయన నిలదీశారు. ప్రజలు కోట్లాది రూపాయల మేర నష్ట పోయారని.. ఇంత పెద్ద ఎత్తున నష్టపోతే ఏరియల్ సర్వే చేస్తారా అని ప్రతిపక్షనేత మండిపడ్డారు.
వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించక పోవడం దుర్మార్గమని.. నాడు ఓట్ల కోసం రోడ్లు పట్టుకొని తిరిగిన జగన్ సీఎం (ys jagan) అయ్యాక ఏరియల్ సర్వేతో సరి పెట్టుకోవడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. పాలిమార్ ఘటన బాధితులకు కోటి రూపాయలు ప్రకటించిన సీఎం జగన్.. సర్వస్వాన్ని కోల్పోయి నిరశ్రాయులుగా మారితే 5 లక్షలు చెల్లిస్తారా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే మృతుల కుటుంబాలకు 25లక్షల మేర పరిహారం అందజేస్తామని.. మందపల్లిని దత్తత తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ALso Read:Chandrababu Naidu: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన.. కడప చేరుకున్న చంద్రబాబు నాయుడు.. (ఫొటోలు)
నాడు విశాఖ విపత్తు సందర్భంగా నిద్ర పోకుండా సహాయక చర్యలు చేపట్టామని.. వారం రోజులు పాటు సహాయక చర్యలు చేపట్టి మాములు స్థితికి తెచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. కానీ సీఎం మాత్రం బయట కాలు పెట్టకుండా హెలికాప్టర్ లో ఏరియల్ సర్వేతో సరిపెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి టీడీపీ తరపున లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు చంద్రబాబు.