ఏపీ: 24 గంటల్లో 196 మందికి పాజిటివ్.. 20,68,672కి చేరిన సంఖ్య, కృష్ణా జిల్లాలో అత్యధికం

Siva Kodati |  
Published : Nov 23, 2021, 07:15 PM ISTUpdated : Nov 23, 2021, 07:17 PM IST
ఏపీ: 24 గంటల్లో 196 మందికి పాజిటివ్.. 20,68,672కి చేరిన సంఖ్య, కృష్ణా జిల్లాలో అత్యధికం

సారాంశం

ఏపీలో కొత్తగా 196 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 242 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,159 మంది చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 196 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,68,672కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,429కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 242 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,52,084కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 26,119 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,02,23,680కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,159 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 3, చిత్తూరు 29, తూర్పుగోదావరి 16, గుంటూరు 21, కడప 7, కృష్ణ 34, కర్నూలు 4, నెల్లూరు 12, ప్రకాశం 8, శ్రీకాకుళం 11, విశాఖపట్నం 19, విజయనగరం 11, పశ్చిమ గోదావరిలలో 21 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Markapuram Bus Accident:మార్కాపురంలో ఘోర ప్రమాదం | Chandrababau | Pawan Kalyan | Asianet News Telugu
AP Bus Accident : మార్కాపురం బస్సు యాక్సిడెంట్ లో తప్పెవరిది..? ప్రమాదమని తెలిసీ ప్రయాణమా..?