అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం వద్ద ఉన్న బ్రాండిక్స్ సెజ్ లో విష వాయువుల లీకేజీ ఎక్కడి నుండి జరిగిందనే విషయమై తెలుసుకొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పోరస్ ఫార్మా కంపెనీలో ఉత్పత్తిని నిలిపివేయాలని కూడా కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది.
:విశాఖపట్టణం: Anakapalle జిల్లాలోని Atchutapuram వద్ద ఉన్న Brandix SEZ లో విష వాయువుల లీకేజీ ఎక్కడి నుండి జరిగిందో తెలుసుకొనేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. Porus Pharma కంపెనీలో ఉత్పత్తిని నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 3, 5 తేదీల్లో బ్రాండిక్స్ సెజ్ లో Gas లీకేజీ చోటు చేసుకొంది.ఈ నెల 3వ తేదీన గ్యాస్ లీకేజీ కారణంగా సుమారు 200 మందికి పైగా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన కార్మికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 5వ తేదీన మరోసారి విష వాయువులు లీకయ్యాయి. అయితే ఈ సమయంలో మాత్రం కంపెనీలో ఎవరూ లేరు. ఈ విషవాయువులు లీకజీపై నిపుణుల బృందం విచారణ చేస్తుంది.
undefined
ఈ సెజ్ లోని Seeds కంపెనీలో ఏసీ డెప్త్ నుండి లీకేజీ జరిగినట్టుగా నిపుణుల బృందం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఏయూ ప్రోఫెసర్లు, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల అధికారుల బృందం గ్యాస్ లీకేజీకి సంబంధించి విచారణ చేస్తుంది. ఏసీ డెప్త్ నుండి లీకైన గ్యాస్ నమూనాలను కూడా పరీక్ష కోసం పంపారు. క్లోరిన్ ఆనవాళ్లు ఎక్కువగా ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు.
గ్యాస్ లీకేజీ ఎక్కడి నుండి జరిగిందనే విషయమై కచ్చితంగా తెలుసుకొనేందుకు గాను పోరస్ పార్మా కంపెనీలో ఉత్పత్తిని నిలిపివేయాలని కాలుష్య నియమంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని కాలుష్య నియంత్రణ మండలి తేల్చి చెప్పింది.