పొత్తుల విషయమై పార్టీ నేతలెవరూ కూడా మాట్లాడవద్దని బీజేపీ జాాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఏపీలో ఏ రకమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ జాతీయ నాయకత్వానికి స్పష్టత ఉందని ఆయన తెలిపారు.
విజయవాడ: పొత్తులపై పార్టీ నేతలు ఎవరూ కూడా మాట్లాడవద్దని BJP జాతీయ అధ్యక్షుడు NP Nadda పార్టీ నేతలకు సూచించారు. ఆ పార్టీకి దూరం ఈ పార్టీకి దూరం అనే తరహా కామెంట్లు చేయవద్దని కూడా పార్టీ నేతలకు నడ్డా సూచించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 6న Vijayawada కు చేరుకొన్నారు. సోమవారం నాడు బీజేపీ ఏపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.Andhra Pradesh రాష్ట్రంలో రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. పొత్తుల విషయమై పార్టీ జాతీయ నాయకత్వం చర్చించనుందని చెప్పారు. Jana Sena చీఫ్ పPawan Kalyan పార్టీ జాతీయ నాయకత్వంతో టచ్‌లో ఉన్నాడని జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న విషయాన్ని నడ్డా గుర్తు చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై బీజేపీకి స్పష్టత ఉందని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో ఏ రకమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ నాయకత్వానికి స్పష్టత ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాంపై స్పష్టత ఉందని ఆయన తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలోనే ఈ విషయమై తమ వైఖరిని స్పష్టం చేస్తామని జేపీ నడ్డా ప్రకటించారు. పొత్తుల విషయమై బీజేపీ నేతలు నోరు మెదపవద్దని కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల విషయమై కొంతకాలంగా పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. తాజాగాా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాష్ట్రంలో మరోసారి alliance అంశంపై చర్చ సాగుతుంది. పవన్ కళ్యాణ్ తన ముందు మూడు ఆఫ్షన్లు ఉన్న విసయాన్ని ప్రకటించారు. బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేయడం, బీజేపీ, జనసేన, TDP లు కలిసి పోటీ చేయడంతో పాటు జనసేన ఒంటరిగా పోటీ చేయడం అంశాలు తమ ముందున్నాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేనతో తాము సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని బీజేపీ నేతలు ప్రకటించారు. YCP నేతలు జనసేన చీఫ్ ప్రకటనలపై విమర్శలు గుప్పించాయి. పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తులు పెట్టుకుంటే తమకు ఏమిటని ప్రశ్నించారు. తాము మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించారు.జనసేన చీఫ్ వ్యాఖ్యలపై టీడీపీ ఆచితూచి స్పందించింది.. పొత్తుల విషయమై Chandrababuదే తుది నిర్ణయమని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు.
also read:పొత్తులు,సీఎం అభ్యర్ధిపై ఇప్పుడే చర్చ అనవసరం: బీజేపీ నేత సత్యకుమార్
ఇదిలా ఉంటే పొత్తులు, CM అభ్యర్ధి ఎంపిక విషయమై కూడా బీజేపీ నాయకత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఎన్నికలు లేని సమయంలో పొత్తుల విషయమై చర్చ అనవసరమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ప్రకటించారు. బీజేపీయేతర అభ్యర్ధిని సీఎంగా ప్రకటించడం తమ పార్టీ సంప్రదాయం కాదని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలోనే సీఎం అభ్యర్ధిని ప్రకటించే సంప్రదాయం తమదని ఆయన పేర్కొన్నారు.