పయ్యావుల ఆవేదన ఇది....

Published : Oct 11, 2017, 06:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
పయ్యావుల ఆవేదన ఇది....

సారాంశం

పరిటాల శ్రీరామ్ వివాహం సందర్భంగా కేసీఆర్ తో కాసేపు ఏకాంతంగా మాట్లాడినందుకు పయ్యావుల కేశవ్ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదా? కెసిఆర్-కేశవ్ ఏకాంత సమావేశంపై చంద్రబాబునాయుడు కేశవ్ పై మండిపడ్డారు. దాంతో పయ్యావుల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. జరిగిన ఘటనలో తన తప్పేముందని పయ్యావుల ప్రశ్నిస్తున్నారు.

పరిటాల శ్రీరామ్ వివాహం సందర్భంగా కేసీఆర్ తో కాసేపు ఏకాంతంగా మాట్లాడినందుకు పయ్యావుల కేశవ్ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదా? కెసిఆర్-కేశవ్ ఏకాంత సమావేశంపై చంద్రబాబునాయుడు కేశవ్ పై మండిపడ్డారు. దాంతో పయ్యావుల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. జరిగిన ఘటనలో తన తప్పేముందని పయ్యావుల ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కనిపిస్తే  ఓ నమస్కారం పెట్టి వెళ్లిపోయానని చెప్పారు. అయితే వెంటనే తనతో వచ్చిన ఓ ఉన్నతాధికారిని కెసిఆర్ తన వద్దకు పంపి తనను పిలిపించుకున్నట్లు కేశవ్ చెబుతున్నారు.

అదేపనిగా పిలిపించినపుడు వెళ్లకుంటే బాగుండదన్న ఉద్దేశంతోనే కేసీఆర్ దగ్గరికి వెళ్లానని కేశవ్ చెబుతున్నారు. తాను వెళ్లగానే తన చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి కేసిఆర్ మాట్లాడిన విషయాన్ని పయ్యావుల గుర్తు చేస్తున్నారు. తానంతట తానుగా తెలంగాణా సిఎం వద్దకు వెళ్లి ఏకాంత భేటీలు జరపలేదన్నారు. చెయ్యని తప్పుకు మాటపడటం తనను బాధిస్తోందని పయ్యావుల వాపోతున్నారు.

కాగా, రేవంత్ రెడ్డి, ఎల్ రమణ తదితరులు ఇటీవల హైదరాబాద్ లో చంద్రబాబుతో సమావేశమైనపుడు కేసీఆర్-పయ్యావుల ఏకాంత చర్చలను ప్రస్తావించారట.  ఈ తరహా చర్యల ద్వారా కింద స్థాయి కార్యకర్తలకు తాము సమాధానం చెప్పుకోలేకపోతున్నట్లు చెప్పారట. ఇదే పరిస్థితి ముందుముందు కూడా కొనసాగితే పార్టీకి రాజీనామా చేయడం మినహా తమకు మరో మార్గం లేదని చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం.

అసలే చంద్రబాబులో అభద్రత ఎక్కువ. పార్టీలో ఏం జరిగినా తానే చెయ్యాలి కానీ తన ప్రమేయం లేకుండా ఇంకెవరో చేస్తుంటే చంద్రబాబు అంగీకరించరన్న విషయం అందరకీ తెలిసిందే. అటువంటిది బద్దశత్రువు, ఓటుకునోటు కేసులో తనను బాగా ఇబ్బంది పెడుతున్న కెసిఆర్ తో ఓ ఎంఎల్సీ ఏకాంతంగా మాట్లాడటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. దానికితోడు తెలంగాణా నేతలు కూడా చంద్రబాబుకు బాగానే పురుక్కించినట్లంది. అందుకనే సమన్వయ కమిటీ సమావేశంలో పయ్యావులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు.

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: చంద్రబాబు, పవన్ పై అంబటి సెటైర్లు | Asianet News Telugu
Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu