నేనేవరో తెలీదా  ! సంతోషం

Published : Oct 06, 2017, 12:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
నేనేవరో తెలీదా  !  సంతోషం

సారాంశం

తెలుగుదేశం-జనసేన మధ్య ఏం జరుగుతోంది? తాజాగా జరుగుతున్న పరిణామాలు ఎవరికీ అర్ధం కావటం లేదు. ఒకవైపు చంద్రబాబేమో పవన్ కల్యాణ్ ను నెత్తినపెట్టుకుంటున్నారు. పవన్ కు రాచమర్యాదలు చేస్తున్నారు. ఇంకోవైపు అదేపార్టీ మంత్రులేమో పవన్ను తీసి పారేసినట్లు మాట్లాడుతున్నారు. దానిపైనే పవన్ తాజాగా ట్వట్టర్ వేదికగా స్పందించారు.

‘కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు పవన్ కల్యాణ్ ఎరో తెలియదు’...‘మంత్రి పితాని సత్యానారాయణకు పవన్ ఎంటో తెలీదు’--సంతోషం...ఇది తాజాగా పవన్ కల్యాణ్ రియాక్షన్. దాదాపు ఏడాది క్రిందట కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ తనకు పవన్ కల్యాణ్ ఎవరో తెలీదన్నారు. తాను సినిమాలు చూడను కాబట్టి తనకు పవన్ ఎవరో తెలీదని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

తాజాగా మంత్రి పితాని సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, పవన్ తో గురించి ఆలోచించేంత తీరిక తమకు లేదన్నారు. పైగా, వచ్చే ఎన్నికల్లో తమకు ప్రధాన ప్రత్యర్ధి వైసీపీనే కానీ జనసేన ఎంతమాత్రం కాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  పితాని చేసిన కామెంట్లు ఇపుడు వైరల్ గా మారింది. అయితే, మంత్రులు అశోక్, పితాని చేసిన కామెంట్లపై శుక్రవారం పవన్ ట్విట్టర్లో స్పందించారు. వారి కామెంట్లపై వ్యగ్యంగా మాట్లాడుతూ తానెవరో తెలీదని చెప్పిన అశోక్, తానేంటో తెలీదని చెప్పిన పితాని కామెంట్లపై ‘సంతోషం’ అంటూ ఎద్దేవా చేసినట్లు పవన్ కూడా ఓ ట్వీట్ వదిలారు.

PREV
click me!

Recommended Stories

నేను మారాను నన్ను నమ్మండి అనడం చంద్రబాబు కి అలవాటే: Perni Nani Comments | YCP | Asianet News Telugu
మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu