భూమా ప్రమాణస్వీకారం

First Published Oct 6, 2017, 11:29 AM IST
Highlights
  • ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి
  • ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో అత్యధిక మెజార్టీతో గెలిచిన భూమా
  • భూమా పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు

నంద్యాల ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందరెడ్డి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ భూమా చేత  తన ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అఖిల ప్రియ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం భూమారెడ్డికి స్పీకెర్ కోడెల అసెంబ్లీ రూల్స్ బుక్ ని అందజేశారు. ఇటీవల నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికలో భూమా బ్రహ్మానందరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి భూమా.. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం లేదనే ప్రచారం జరుగుతోంది.  నంద్యాలలో ఉప ఎన్నికల్లో భూమాని దింపినప్పుడే.. ఆయన కు రానున్న ఎన్నికల్లో సీటు ఇవ్వనని చంద్రబాబు ముందుగానే చెప్పాడట.  అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. దీంతో.. ఆయన ఎమ్మెల్యే పదవి తాత్కాలిక పదవిలా మారింది. మహా అంటే.. ఆయన ఆ పదవిలో ఏడాదిన్నర ఉంటారేమో. అందుకే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదనే వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా.. ఇప్పుడు పార్టీలో ఉన్నవారంతా సీనియర్లే. వారితో పోలిస్తే.. బ్రహ్మానందరెడ్డి చాలా చిన్నవాడు. దీంతో సీనియర్ నేతలతో పెద్దగా కలవలేకపోతున్నాడట. వాళ్లు కూడా భూమా ని దూరంగానే పెడుతున్నారట. దీంతో.. ‘ ఇంటింటికీ తెలుగు దేశం’ కార్యక్రమం నంద్యాలలో సరిగా జరగడంలేదు.

వివిధ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమ పనితీరును బట్టి చంద్రబాబు గ్రేడ్లు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అందులో నంద్యాలకు ‘డి’ గ్రేడ్ వచ్చింది. దీంతో భూమా పనితీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అదేవిధంగా మంత్రి అఖిలప్రియ మీద కూడా చంద్రబాబు ఫైర్ అయ్యారట. ఆమె ప్రాతినిద్యం వహిస్తున్న ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సి గ్రేడ్ వచ్చిందట. అఖిల ప్రియ మంత్రి పదవిని అలంకరించి 6నెలలు దాటిపోయింది. ఇప్పటికీ ప్రజలతో కలవకుండా, పార్టీ కార్యక్రమాల్లో సరిగా కలవకుండా వ్యవహరిస్తోందనేది టాక్. అందుకే ఆళ్లగడ్డలో ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమం విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి.

click me!