ఈ అవకాశవాదం చూడమంటున్న పవన్...

Published : Jan 26, 2017, 03:25 AM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
ఈ అవకాశవాదం చూడమంటున్న పవన్...

సారాంశం

హోదా మీద  ఆంధ్ర నేతల పచ్చి  అవకాశ వాదం ఇది

 

వైజాగ్ లో పోలీసు నిర్బంధం తీవ్రమయింది. అయినా, సరే, జన సేన నేత పవన్ కల్యాణ్  పిలుపు మేరకు అనేక ప్రాంతాలనుంచి  యువకులు నగరంలో కి చేరుకుంటున్నారు.  అయితే, వారిని రామకృష్ణ బీచ్ కు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అంధ్రాయువతకు చెందిన వేలాది మంది యువకులు మౌన దీక్ష  పవన్ చెప్పినట్లు శాంతియుతంగా నిర్వహించేందుకు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇపుడు విడుదల చేసిన వీడియో  ఇది. ఇందులో కొందరు అంధ్ర నేత ల అవకాశం వాదం  ఎలా ఉందో చూడవచ్చు.

 

హోదా మీద ఎవరు ఏమన్నారో ప్రత్యేకంగా చె ప్పాల్సిన అవసరం లేదు. వీడియోలో నేతలున్నారు, వారి మాటలున్నాయి. అవెలా మారిపోయాయో, మాట మార్చిన అవకాశానికి సన్మానాలెలా జరిగాయో కూడా  వీడియోలోనే ఉన్నాయి.

 

ఆంధ్ర యువత సమావేశ కాకుండా వుండేందుకు దాదాపు వేయి మంది పోలీసులు బీచ్ లో మొహరించారు. అక్టోపర్, గ్రేహైండ్ దళాలను కూడా దింపారు.బీచో మొత్తం పోలీసులే కనిపిస్తున్నారు. ఐడెండిటి కార్డు ఉన్న వారినే ఈ రోడ్ మీద అనుమతిస్తున్నారు.

 

వందల మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం

 

అయితే, ఆంధ్రయువత మాత్రం నిరసన తెలుపుతామని చెబుతూనే ఉన్నారు.

ఈ రోజు కేంద్ర నిఘా వర్గాల సూచన ప్రకారం ఎలాంటి రాజకీయ కార్యక్రమాలలకు అనుమతి లేదని పొలీలసులు చెబుతున్నారు. అయితే,  ఈ మౌన దీక్షను, శాంతియుత కార్యక్రమాన్ని అనుమతించాలని పవన్ కోరుతున్నారు.

 

మౌనదీక్షా సమయం అసన్నమయింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విశాఖ ఆంధ్రా యువత డిమాండ్‌ చేస్తుంది. వైఎంసీఏ దగ్గర దీక్ష చేపడతామని విశాఖ ఆంధ్ర యువత ప్రకటించింది. జనసేన, విద్యార్థి సంఘాలు, బార్‌ అసోసియేషన్‌, వైసీపీలు మద్దతు ప్రకటించాయి.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : కేవలం నాల్రోజులే సంక్రాంతి హాలిడేస్.. కానీ 11 సెలవులు ఎక్స్ట్రా
IMD Rain Alert : హిందూ మహాసముద్రంలో మరో తుపాను .. అక్కడ కుండపోత వర్షాలు.. తెలుగు రాష్ట్రాల సంగతేంటి..?