పవన్ ఒంగోలు వస్తున్నాడు...

Published : Jan 12, 2017, 08:20 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
పవన్ ఒంగోలు వస్తున్నాడు...

సారాంశం

పవన్ కల్యాణ్   తదుపరి మీటింగ్   ఒంగోలులో . తన  2019 యాత్ర మీద  ఒక కీలకమయిన ప్రకటన చేయవచ్చని చెబుతున్నారు.

ఇచ్ఛాపురం మీటింగ్ తో ప్రభుత్వం  దిగి వచ్చి కిడ్నీ బాధితుల కోసం ఒక కార్యాచరణ ప్రణాలిక ప్రకటించేలా చేసిన పవర్ స్టార్, జనసేనాపతి పవన్ కల్యాణ్ అయిదో పర్యటన , నాలుగో  భారీ మీటింగ్ కు సిద్దమవుతున్నారు. ఇంతవరకు ఆయన తిరుపతి, కాకినాడు, అనంతపురం సమావేశాలలో ప్రసంగించారు. ఇటీవల సందర్శించిన ఇచ్ఛాపురం ఈ కోవలోకి రాదు. అది  ఒక సమస్య మీద పవర్ స్టార్ స్పందించిన తీరు.

 

అయితే, ఆయన తిరుపతిలోప్రకటించిన రాజకీయ అజండా ప్రకారం నాలుగో మీటింగ్ తొందరలో ఒంగోలులో జరుగుతున్నదని విశ్వసనీయంగా తెలిసింది.  తిరుపతి, కాకినాడ, అనంతపురం మీటింగ్ లు ఒక్కొక్కటి ఒక మిసైల్ ను పేల్చాయి.

 

కర్నాటకలో మృతి చిందిన పవన్ వీరాభిమాని వినోద్ రాయల్ కుటుంబానికి సంతాపం తెలిపుందకుతిరుపతి వచ్చిన పవన్ , మరుసటి బహిరంగ ఏర్పాటు చేసి,  ప్రత్యేక హోదాయే అసలైన సమస్య, అదే మా అజండా అని స్పష్టం చేశారు.

 

తర్వాత కాకినాడు మీటింగ్ జిల్లాజిల్లాలో తిరుగుతానని కార్యాచరణ ప్రకటించారు. అందులో భాగాంగా రాయలసీమలో బాగా వెనకబడిన అనంతపురం జిల్లా మొదటి ఎన్నికల యాత్ర ప్రారంభ సభ ఏర్పాటు చేశారు. తాను అనంతపురం నుంచి పోటీచేస్తానని ప్రకటించారు. పార్టీ ఎన్నికల కార్యాలయం మొదట అక్కడే మొదలవుతుందని చెప్పారు. అంతేకాదు, అమరావతిమీద వరల్డ్ క్లాస్ మీద నిరసన వ్యక్తం చేశారు. తానయితే అంత పెద్ద అమరావతి కట్టనని కూడా తన రాజకీయ పంధా ఏమిటో చెప్పారు.

 

ఇపుడు ఒంగో లు మీటింగ్  పవన్ స్టార్ 2019 యాత్రను మరొక కీలకమలుపు తిప్పనుంది. ఒంగోలు నుంచి ఆయన కీలకమయిన మరొక ప్రకటన చేయనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  అమరావతికిజానెడు దూరంలో ఉన్న అభివృద్ధిలో  మాత్రం అందని ద్రాక్ష అయిందనది ఆయన అభిప్రాయం. అందువల్ల ప్రకాశం జిల్లా గురించి ఇపుడు ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు.

 

ఒంగోలు సమావేశం జనవరి చివరి వారంలో గాని, ఫిబ్రవరి మొదటివారంలో గాని ఉండవచ్చని విశ్వసనీయంగా తెలిసింది. సభాస్థలం అన్వేషణ మొదలయింది. సంక్రాంతి తర్వా త ఆయన సభ వివరాలను ప్రటిస్తారు. పార్టీ ప్రకటన  గా వెలవడవచ్చు లేదా పవన్ స్వయంగా ట్వీట్ చేయవచ్చని ఆయన సన్నిహితులొకరు తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?