అన్నయ్య ఫ్యామిలిపై రాజకీయ కుట్ర: పవన్ ఉద్వేగం

Published : Jul 06, 2018, 09:05 PM IST
అన్నయ్య ఫ్యామిలిపై రాజకీయ కుట్ర: పవన్ ఉద్వేగం

సారాంశం

తన అన్నయ్య చిరంజీవి కుటుంబంపై రాజకీయ కుట్ర జరిగిన సమయంలోనూ అవే ఆలోచనలు వచ్చాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అంతపెద్ద స్థాయి వ్యక్తిపై కుట్రలు జరుగుతుంటే సామాన్యుల సంగతేమిటని ప్రశ్నించుకున్నట్లు తెలిపారు. 

విశాఖపట్నం:  తన అన్నయ్య చిరంజీవి కుటుంబంపై రాజకీయ కుట్ర జరిగిన సమయంలోనూ అవే ఆలోచనలు వచ్చాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అంతపెద్ద స్థాయి వ్యక్తిపై కుట్రలు జరుగుతుంటే సామాన్యుల సంగతేమిటని ప్రశ్నించుకున్నట్లు తెలిపారు. 

ఆ క్షణం రాజకీయాలపై విసుగువచ్చిందని చెప్పారు. అయితే తాను యోగమార్గంలో దేవుడిని చేరడం వల్ల సమస్యలు తీరవనిపించిందనిఅన్నారు. తనకు ఒక్కడికి ముక్తి వస్తే సరిపోదని, అందరూ ఆకలితో బాధపడుతుంటే అందరూ ఏడుపులు ఏడుస్తుంటే తనకు అలాంటి భగవంతుడు వద్దనిపించిందని చెప్పారు. అలా మళ్లీ రాజకీయబాట పట్టానని చెప్పారు.

ఏదో ఆశించి తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల కోసమే వచ్చానని చెప్పారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నేతలు తనను సంప్రదించినప్పుడు ఈ విషయాన్నే చెప్పానని అన్నారు ఏం కావాలని అడిగితే తనకేది వద్దన్నానని ప్రజలకు మంచి జరిగితే చాలునని చెప్పినట్లు తెలిపారు. 

విశాఖకు చెందిన నాయకులు తన పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. చాలా ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చానని,. ఎందుకంటే రిస్క్ తనదని,. పోతే తన ప్రాణాలు పోతాయని, కోరికలు ఏమీ పెట్టుకోలేదని అన్నారు. తాను భగవన్మార్గాన్ని వదిలి వచ్చినవాడినని, యోగ మార్గాన్ని వదిలి వచ్చిన వాడినని, ముక్తి లభించవచ్చు గానీ ప్రజలు ఏడుస్తుంటే.. ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే.. అలాంటి పనికిమాలిన ముక్తి ఎందుకు అనిపించిందని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu