ప్రత్యేక హోదా: కేంద్రంపై న్యాయపోరాటానికి ఎపి కసరత్తు

First Published Jul 6, 2018, 6:10 PM IST
Highlights

విభజన హామీలపై న్యాయపోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

అమరావతి: విభజన హామీలపై న్యాయపోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి వర్గ నిర్ణయాలను కాల్వ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ కు కౌంటర్ దాఖలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విభజన హామీలపై విడివిడిగా కోర్టులో పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

న్యాయనిపుణులతో చర్చించి ఆ విషయంపై నిర్ణయం తీసుకున్నారు. తొలుత కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసి అఫిడవిట్ కు కౌంటర్ దాఖలు చేయాలని, ప్రతి శాఖ నుంచి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది.

click me!