ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్దమైన పవన్ కల్యాణ్.. పోలీసుల వ్యవస్థ మీద పోరాటం కాదని వెల్లడి..

Published : Oct 17, 2022, 03:55 PM IST
ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్దమైన పవన్ కల్యాణ్.. పోలీసుల వ్యవస్థ మీద పోరాటం కాదని వెల్లడి..

సారాంశం

విశాఖపట్నంలో జనసేన నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్దమైనట్టుగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకోనున్నారు.

విశాఖపట్నంలో జనసేన నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్దమైనట్టుగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ శ్రేణులతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. విజయవాడకు బయలుదేరే ముందు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..  115 మందికి పైగా జనసేన పార్టీకి చెందినవారిని అరెస్ట్ చేశారని చెప్పారు. అందరిపైనా హత్యాయత్నం కేసులు పెట్టారని తెలిపారు. జనసేన కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులపై న్యాయ పోరాటానికి నిపుణులతో చర్చిస్తున్నామని చెప్పారు. 

మొన్న రాత్రి నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలను బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిపారు. చాలా మందిని బెయిల్‌పై బయటకు తీసుకురావడం జరిగిందని.. రిమాండ్ విధించినవారికి కూడా బెయిల్ వచ్చేలా న్యాయ పోరాటం చేస్తామని  చెప్పారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని.. అది రేపు విచారణకు రానుందని తెలిపారు. 

 


ప్రభుత్వం మీద పోరాటం తప్ప.. పోలీసు వ్యవస్థ మీద పోరాటం కాదని చెప్పారు. బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారని.. ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా తాను వారికి అభివాదం చేసే అవకాశం కూడా లేకుండా పోయిందని తెలిపారు.  

Also Read: ప్రత్యేక విమానంలో విజయవాడకు రానున్న పవన్ కల్యాణ్.. గవర్నర్‌తో భేటీ అయ్యే అవకాశం..

ఇక, రేపు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌‌ను పవన్ కల్యాణ్ కలిసే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే జనసేనకు గవర్నర్ అపాయింట్‌మెంట్ విషయంలో స్పష్టత రావాల్సి ఉందని తెలుస్తోంది.  రేపు గవర్నర్ అపాయింట్‌మెంట్ లభిస్తే.. తన విశాఖ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను పవన్ ఆయనకు వివరించే అవకాశం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?