తిరుపతి- హైదరాబాద్‌ స్పెషల్ ట్రైన్‌లో దొంగల బీభత్సం.. మహిళల గొలుసులు చోరీ..

Published : Oct 17, 2022, 03:33 PM IST
 తిరుపతి- హైదరాబాద్‌ స్పెషల్ ట్రైన్‌లో దొంగల బీభత్సం.. మహిళల గొలుసులు చోరీ..

సారాంశం

తిరుపతి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నస్పెషల్ ట్రైన్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. మహిళా ప్రయాణికుల నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లిపోయారు. 

తిరుపతి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నస్పెషల్ ట్రైన్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. మహిళా ప్రయాణికుల నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లిపోయారు. అర్దరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. రైలు కడప జిల్లాలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం దొంగలు.. కమలాపురం - ఎర్రగుంట్ల మధ్యలోని ఎర్రగుడిపాడు వద్ద ట్రైన్ ఆపి దిగేశారు. ఈ ఘటనపై మహిళా ప్రయాణికులు.. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రైల్వే పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నాయి. 

రైలులోని ఎస్‌ 7 కోచ్‌లో కొందరు మహిళల వద్ద నుంచి బంగారు గొలుసులు చోరీకి గురైనట్టుగా ఫిర్యాదు అందినట్టుగా రైల్వే పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు
Vegetables Price : దిగజారిన టమాటా, స్థిరంగా ఉల్లి... ఈ వీకెండ్ కూరగాయల రేట్లు ఇవే