మంత్రి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందికర పరిస్థితులు.. ప్రతిరోజు మెంటల్ టెన్షన్ పెడుతున్నారని ఆవేదన..

By Sumanth KanukulaFirst Published Oct 17, 2022, 3:13 PM IST
Highlights

మంత్రి రోజా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు. వైసీపీ మీద, సీఎం జగన్ మీద కామెంట్స్ చేసేవారిపై తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తుంటారు. అయితే తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గానికి వచ్చేసరికి.. రోజా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 

మంత్రి రోజా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు. వైసీపీ మీద, సీఎం జగన్ మీద కామెంట్స్ చేసేవారిపై తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తుంటారు. అయితే తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గానికి వచ్చేసరికి.. రోజా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆమె సొంత పార్టీలోని వ్యతిరేక వర్గం నుంచి మద్దతు లభించడం లేదు. గత కొంతకాలంగా నగరి వైసీపీలో.. రోజా అనుకూల, వ్యతిరేక వర్గాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో ఈ విషయం బహిర్గతమైంది. 

తాజాగా మరోసారి తన వ్యతిరేక వర్గం తీరుపట్ల కార్యకర్తలతో తన ఆవేదన వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం కొప్పేడు గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం గురించి రోజాకు సమాచారం లేనట్టుగా తెలుస్తోంది. 

దీంతో మంత్రిగా ఉన్న తనను నియోజకవర్గంలో వీక్ చేసే విధంగా సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను లేకుండా.. తనకు చెప్పకుండా .. భూమి పూజ చేయడంపై  ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలతో రోజా మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ఒకటి వైరల్‌గా మారింది. అందులో..‘‘మంత్రిగా ఉన్న తనను నియోజకవర్గంలో వీక్ చేసే విధంగా.. టీడీపీ, జనసేన నవ్వుకునే విధంగా.. ఆ పార్టీలకు సపోర్టు అవుతూ.. నాకు నష్టం జరిగే విధంగా.. మన పార్టీని దిగజారుస్తూ  వీళ్లు భూమి పూజ చేయడం ఎంత వరకు కరెక్ట్.. మీరంతా ఆలోచించాలి.. ఇలాంటి వాళ్లు కంటిన్యూ అయితే నేను రాజకీయాలు చేయడం కష్టం. నేను ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే.. ప్రతిరోజు మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా పార్టీకి, మాకు నష్టం చేకూరుస్తున్నారు. వీళ్లు పార్టీ నాయకులని చెప్పి ఎంకరేజ్ చేయడం కూడా బాధేస్తుంది’’ అని రోజా పేర్కొన్నారు. 

click me!