జగన్‌కు అలీ ట్విస్ట్: జనసేనానికి జై కొట్టేనా?

Published : Jan 06, 2019, 12:13 PM IST
జగన్‌కు అలీ ట్విస్ట్: జనసేనానికి  జై కొట్టేనా?

సారాంశం

సినీ నటుడు అలీ ఏ పార్టీలో చేరుతారనే విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. 

అమరావతి: సినీ నటుడు అలీ ఏ పార్టీలో చేరుతారనే విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 9వ తేదీన అలీ వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న సమయంలోనే ఆయన పవన్ కళ్యాణ్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. అలీ రాజకీయ భవిష్యత్తుకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీంతో  అలీ వైసీపీలో చేరే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

ఇటీవల వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను సినీ నటుడు అలీ కలిశారు.వైసీపీలో అలీ చేరుతారనే ప్రచారం కూడ ఉంది. ఈ నెల 9వ తేదీన అలీ వైసీపీలో చేరుతారనే జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలోనే ఆదివారం నాడు అలీని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వద్దకు ఆ పార్టీ నేత ముత్తంశెట్టి కృష్ణారావు తీసుకెళ్లారు.

రెండు గంటల పాటు  పవన్ కళ్యాణ్‌తో అలీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  సుమారు రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని అలీకి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను సినీ నటుడు అలీ మర్యాద పూర్వకంగా కలిశారని జనసేన వర్గాలు గుర్తు చేస్తున్నాయి. జనసేనతోనే అలీ ఉంటారని స్పష్టం చేస్తున్నాయి.  

ఈ పరిణామాలు హట్ టాపిక్‌గా మారాయి. వైసీపీలో అలీ చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో  ఈ ఘటన చర్చకు దారి తీస్తోంది. అసలు అలీ వైసీపీలో చేరుతారా.. జనసేన వైపు మొగ్గు చూపుతారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్‌తో భేటీ తర్వాత అలీ జనసేనతో ఉంటారని ఆ పార్టీ ప్రకటించడం కొంత ఆసక్తిని కల్గిస్తోంది. ఈ విషయమై అలీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది

సంబంధిత వార్తలు

వైసీపీలోకి అలీ: పవన్ తో భేటీ,మతలబేంటీ?

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?