జగన్‌ కేసు ఎన్ఐఏ కు బదిలీ: న్యాయ పోరాటానికి ఏపీ సర్కార్

By narsimha lodeFirst Published Jan 6, 2019, 11:37 AM IST
Highlights

ఏపీ విపక్షనాయకుడు వైఎస్ జగన్‌‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిని ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 


అమరావతి: ఏపీ విపక్షనాయకుడు వైఎస్ జగన్‌‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిని ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేసు విషయంలో కేంద్రం ఉత్సాహం చూపడాన్ని రాజకీయ కోణంగా చూడాలని ఏపీ సర్కార్ అభిప్రాయంతో ఉంది.

జగన్‌పై దాడి కేసు విషయమై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా విచారణ జరుపుతున్న సమయంలో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది.

ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రెండు రోజులుగా పోలీసు అధికారులతో పాటు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.ఈ విషయమై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఎన్ఐఏకు అప్పగించడంపై చంద్రబాబు సర్కార్  తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.ఈ విషయమై న్యాయ పోరాటం చేయాలని  బాబు భావిస్తున్నారు.

అయితే ఈ కేసును సుప్రీంకోర్టులో దాఖలు చేయాలా.. హైకోర్టులో దాఖలు చేయాలా.. ఏఏ అంశాలను ప్రస్తావించాలి...ఈ కేసు విషయంలో  కేంద్రం ఎందుకు అతిగా స్పందిస్తోందనే విషయాన్ని బట్టబయలు చేయాలని టీడీపీ భావిస్తోంది.

జగన్‌‌ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం తీసుకొన్న రాజకీయపరంగా తీసుకొన్న నిర్ణయంగానే టీడీపీ భావిస్తోంది. ఈ విషయమై హైకోర్టులో సవాల్ చేయాలని  ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడు రెండు రోజులుగా ఆయా జన్మభూమి సభల్లో కూడ ప్రస్తావిస్తున్నారు.గత ఏడాది అక్టోబర్ మాసంలో వైఎస్ జగన్‌పై  శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.   

click me!