250 గజాల స్థలంలో ప్రకృతి వ్యవసాయం అంటున్న పవన్ కళ్యాణ్

Published : Sep 05, 2020, 09:35 PM ISTUpdated : Sep 06, 2020, 03:45 PM IST
250 గజాల స్థలంలో ప్రకృతి వ్యవసాయం అంటున్న పవన్ కళ్యాణ్

సారాంశం

కరోనా విపత్తు వల్ల నగరాల్లో ఉపాధి కోసం వచ్చినకార్మికులు, చిరుద్యోగులుస్వస్థలాలకు వెళ్ళిపోయారు... అలాంటివారు సొంత ఊళ్లోనే ఉపాధి పొందేందుకు అవకాశంఉన్న సాగు విధానం నమూనాలు రూపొందిస్తున్నాం అన్నారు. 

చాతుర్మాస దీక్షలో భాగంగా బయట పెద్దగా జనసేనాని కనిపించడం లేదు. తన జన్మదినోత్సవాన్ని కూడా నిరాడంబరంగా తనఫామ్ హౌస్ లోనే జరుపుకున్నారు. ఇక తాజాగా ప్రకృతి వ్యవసాయం అంటూ ప్రజల ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్. 

వ్యవసాయం అంటే కనీసంఅరెకరం ఉండాలి అనుకొంటూ ఉంటాం... అలా కాకుండా కొద్దిపాటి జాగాలో సాగు చేసి ఆదాయంపొందే విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించబోతున్నాం అని జనసేన అధ్యక్షులు శ్రీపవన్ కల్యాణ్ గారు తెలిపారు. 

కరోనా విపత్తు వల్ల నగరాల్లో ఉపాధి కోసం వచ్చినకార్మికులు, చిరుద్యోగులుస్వస్థలాలకు వెళ్ళిపోయారు... అలాంటివారు సొంత ఊళ్లోనే ఉపాధి పొందేందుకు అవకాశంఉన్న సాగు విధానం నమూనాలు రూపొందిస్తున్నాం అన్నారు. 

50x50 విస్తీర్ణంలో అంటే సుమారుగా 250 గజాల భూమిలో ఆదాయం ఇచ్చే విధంగా చేయడం లక్ష్యంగాఈ సాగు ప్రక్రియ ఉంటుంది అని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ కార్యక్రమంచేపడ్తాం అన్నారు. ప్రముఖ ప్రకృతి రైతు శ్రీ విజయరామ్ గారి సలహాసహకారాలతో తనవ్యవసాయ క్షేత్రంలో శ్రీ పవన్ కల్యాణ్ గారు శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు.

ఈ సందర్భంగాశ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “మనకు విజ్ఞానాన్ని, చదువు, సంస్కారాన్నిఅందించిన గురుదేవుళ్ళను శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగాస్మరించుకొంటూ వ్యవసాయ విజ్ఞాన విషయాలను పంచే కార్యక్రమాన్ని చేపట్టాం. 

రాజకీయాలకుఅతీతంగా యువతకు, రైతులకుప్రకృతి వ్యవసాయాన్ని... అదీ చిన్నపాటి భూమిలో సాగు చేయడం గురించి తెలియచేస్తాం. 250 గజాల్లో 81 మొక్కలు... ఒకక్రమ విధానంలో నాటి సాగు చేయడం ద్వారా ఏ విధంగా ఫల సాయం పొందవచ్చో తెలియచేస్తాం.

ప్రకృతి రైతు శ్రీ విజయరామ్ గారితో గత 10 సంవత్సరాలనుంచి పరిచయం ఉంది. వారు శ్రీ సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ విధానాలుఅనుసరిస్తూ ఉంటారు. శ్రీ విజయరామ్ గారి సలహాలు ప్రకారం కొన్ని నమూనాలు తయారుచేస్తున్నాం అని పవన్ అన్నారు. 

"చారెడు నేల – బతుకు బాట అనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఉంటుంది. పరిమిత విస్తీర్ణంలో ఎలా సేద్యం చేయాలి అనేదానిపై ఒక ప్రణాళిక మేరకు నిర్దేశిత డైరీతో అవగాహన కల్పిస్తాం. ప్రతి కుటుంబం కలసి పని చేసుకొని ఆదాయం పొందే విధంగా ఈ తరహా వ్యవసాయ విధానం ఉంటుంది. 

81 మొక్కల్లో ఏవేవీ ఉండాలి... వాటికి నీటి వసతి ఎలా సమకూర్చాలి, అందుకు అనుసరించాల్సిన పద్ధతులను సమగ్రంగా తెలియచేస్తాం. ప్రయోగాత్మకంగా నా వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఔత్సాహికులకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తాం” అన్నారు. 

ఈ సందర్భంగా శ్రీ సుభాష్ పాలేకర్ రాసిన ‘పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం’,  ‘పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం చేయడం ఎలా”, ‘ఔనా... సేంద్రీయ వ్యవసాయం ఎక్కువ ప్రమాదకరమా’,తోపాటు తాను రాసిన ‘ప్రకృతి వ్యవసాయం’ పుస్తకాలను కొన్ని విత్తన రకాలను శ్రీ విజయరామ్ గారు శ్రీ పవన్ కల్యాణ్ గారికి అందించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్