ఏపీలో కరోనా ఉధృతి: వరుసగా 10వ రోజు 10 వేలు దాటిన కేసులు

By team teluguFirst Published Sep 5, 2020, 8:48 PM IST
Highlights

వరుసగా 10వ రోజు కూడా 10 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10,825 మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్టు వైద్య ఆరోగ్య శాఖా ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. వరుసగా 10వ రోజు కూడా 10 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10,825 మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్టు వైద్య ఆరోగ్య శాఖా ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో దాదాపుగా 70 వేల కరోనా పరీక్షలను నిర్వహించగా అందులో 10 వేళా కేసులు పాజిటివ్ గా తేలాయి. 

నేడు నమోదైన కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 4,87,331కు చేరింది. కొత్తగా 71 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 4,347కి చేరింది. నిన్నొక్కరోజే 11,941మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అవ్వగా... ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3,82,104 కి చేరుకుంది. 

ఇప్పటి వరకు రాష్ట్రంలో 40,35,317 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,01,210 గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 100కి పైగా కేసులు నమోదయ్యాయి. 

: 05/09/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 4,84,436 పాజిటివ్ కేసు లకు గాను
*3,79,209 మంది డిశ్చార్జ్ కాగా
*4,347 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,00,880 pic.twitter.com/lmSSiVndcP

— ArogyaAndhra (@ArogyaAndhra)

అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1399 కేసులు నమోదవగా, ఆ తరువాత ప్రకాశం లో 1332 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానాల్లో పశ్చిమగోదావరి (1103), నెల్లూరు (1046), కడప (1039) ఉన్నాయి. 

click me!