బ్రేకింగ్: కాన్వాయ్‌కి అడ్డొచ్చిన ఆవు.. చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం

Siva Kodati |  
Published : Sep 05, 2020, 06:03 PM ISTUpdated : Sep 05, 2020, 06:20 PM IST
బ్రేకింగ్: కాన్వాయ్‌కి అడ్డొచ్చిన ఆవు.. చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం

సారాంశం

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆయన కాన్వాయ్‌ దండుమల్కాపురం వద్ద ప్రమాదానికి గురైంది

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆయన కాన్వాయ్‌ దండుమల్కాపురం వద్ద ప్రమాదానికి గురైంది.

ఆయన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనానికి ఆవు అడ్డురావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. వాహనం మొరాయించడంతో 15 నిమిషాల పాటు చంద్రబాబు రోడ్డుపైనే ఆగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం శ్రేణులు ఉలిక్కిపడ్డాయి.

"

PREV
click me!

Recommended Stories

పల్నాడు జిల్లాలో వరద బీభత్సం జలమయమైన జాతీయ రహదారి| Palnadu District | Heavy Rains Traffic Disruption
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. జ‌గ‌న్ కంచు కోట‌లో కూడా