వారిది బూతు మాధ్యమం: ద్వారంపూడి వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్

Published : Jan 14, 2020, 08:24 PM ISTUpdated : Jan 14, 2020, 08:36 PM IST
వారిది బూతు మాధ్యమం: ద్వారంపూడి వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్

సారాంశం

వైసీపీ వాళ్లది ఇంగ్లీష్ మాధ్యమం కాదని, బూతు మాధ్యమమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నిరసన తెలియజేస్తే కొడుతారా అని ప్రశ్నించారు. తాము రోడ్ల మీదికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు.

కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెసు పైకి చెప్పేది ఇంగ్లీష్ మాధ్యమమని, వాళ్ల తీరు మాత్రం బూతు మాధ్యమమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లానని ఆయన చెప్పారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన తమ పార్టీ కార్యకర్తలను ఆయన మంగళవారంనాడు పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వైసీపీపై ఆయన మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు, హెచ్చరికలు చేశారు. 

Also Read: పవన్ కళ్యాణ్ పై బూతుపురాణం: శ్రీరెడ్డికి తీసిపోని ఎమ్మెల్యే ద్వారంపూడి

ఏ ఆశయాలతో ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు వెళ్తున్నారో ఆ ఆశయాలు ఏపీలో కనిపించడం లేదని అన్నారు. రాష్ట్రంపై దృష్టి సారించాలని కేంద్రాన్ని తాను కోరినట్లు ఆయన తెలిపారు. విశాఖ ప్రజలు రాజధానిని కోరుకోలేదని, వైసీపీ నేతలు మాత్రమే కోరుకున్నారని ఆయన అన్నారు.

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని ఆయన తప్పు పట్టారు. పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారని ఆయన అన్నారు. తాము శాంతిభద్రతల సమస్య సృష్టించాలని అనుకుంటే వైసిపీ వాళ్లు ఇక్కడ ఉండలేరని ఆయన అన్నారు. తాను తెగించి రోడ్లపైకి వస్తే ఏమీ చేయలేరని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ మంగళవారంనాడు గాయపడిన జనసేన కార్యకర్తలను పరామర్శించారు.

Also Read: మీరు ఒక్కటంటే నేను అంతకు మించి మాట్లాడుతా: పవన్ పై ద్వారంపూడి

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్