నేను ఏడిస్తే సమస్య పరిష్కారం కాదు: తిత్లీపై బాబుకు పవన్ కౌంటర్

By narsimha lodeFirst Published Oct 17, 2018, 6:14 PM IST
Highlights

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ విధ్వంసంతో సర్వం కోల్పోయిన ప్రజలను చూస్తే తనకు  కన్నీళ్లు వచ్చాయని జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ చెప్పారు.


శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ విధ్వంసంతో సర్వం కోల్పోయిన ప్రజలను చూస్తే తనకు  కన్నీళ్లు వచ్చాయని జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ చెప్పారు.
తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్  శ్రీకాకుళం జిల్లాలో బుధవారంనాడు పర్యటించారు.

శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడులో బుధవారం నాడు పవన్ కళ్యాణ్  పర్యటించారు. తిత్లీ తుఫాన్  కల్గించిన  నష్టం బయటకు  తెలియదన్నారు.  ప్రజల కష్టాలను  చూస్తే  తనకు ఏడుపొస్తోందన్నారు.  కానీ, తాను ఏడిస్తే సమస్య పరిష్కారం కాదన్నారు.

సిక్కోలు ప్రజల ఆవేదనను  తన గుండెల్లో పెట్టుకొంటానని ఆయన చెప్పారు. తుఫాన్  వల్ల సంభవించిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహాయం  చేయాలని  కోరుతానన్నారు.  నిస్సహాయస్థితిలో ఉన్న ప్రజలను  కొందరు అధికారులు బెదిరిస్తున్నారని... ప్రజలను  ఎవరైనా బెదిరిస్తే  తోలు తీస్తానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

జగన్ కు కౌంటర్, బాబుకు సవాల్: పవన్ కవాతు రాజకీయ వ్యూహమే

మాజీలకు పవన్ వల:చిక్కుకున్న ఆ నలుగురు
ఒక్క బాలకృష్ణ టికెట్టే ఫైనల్: పవన్

click me!