పవన్ కళ్యాణ్ మానసిక స్థితి సరిగ్గా లేదు: వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని

Published : Oct 17, 2018, 04:57 PM IST
పవన్ కళ్యాణ్ మానసిక స్థితి సరిగ్గా లేదు: వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని

సారాంశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్లనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ని ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించేందుకు పవన్ ప్రయత్నించడం చూస్తుంటే మానసిక స్థితి సరిగా లేదని మండిపడ్డారు. పవన్‌ వైఎస్‌ జగన్‌ను ఫ్యాక్షనిస్టు అని పేర్కొనడం సరికాదని హితవు పలికారు. జగన్ రాజకీయ ఎదుగుదలను ఒర్వలేకే కాంగ్రెస్, టీడీపీలు ఆయనపై తప్పుడు కేసులు పెట్టాయని స్పష్టం చేశారు.  

ఏలూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్లనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ని ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించేందుకు పవన్ ప్రయత్నించడం చూస్తుంటే మానసిక స్థితి సరిగా లేదని మండిపడ్డారు. పవన్‌ వైఎస్‌ జగన్‌ను ఫ్యాక్షనిస్టు అని పేర్కొనడం సరికాదని హితవు పలికారు. జగన్ రాజకీయ ఎదుగుదలను ఒర్వలేకే కాంగ్రెస్, టీడీపీలు ఆయనపై తప్పుడు కేసులు పెట్టాయని స్పష్టం చేశారు.  

తమ అధినేత జగన్ పై తప్పు ప్రచారాలు ఆపకపోతే పవన్ కల్యాణ్‌కు, జనసేన పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నానని చెప్పుకుంటున్న పవన్‌ ఏనాడైనా ఢిల్లీ వెళ్లి ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పిలవలేదు కాబట్టే ఢిల్లీ వెళ్లలేదని పవన్‌ చెప్పడం హాస్యాస్పదమన్నారు. 

జగన్ పై విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు అవినీతి అవినీతి  కనిపించడం లేదా అని నిలదీశారు. టీడీపీని మరోసారి అధికారలోకి తేవడానికే పవన్‌ కళ్యాణ్‌ పనిచేస్తున్నారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకేష్‌ను పవన్‌ తమ్ముడిగా ఎలా సంభోదిస్తారని ప్రశ్నించారు. ప్రజల గోడును విందామని, కళ్లారా చూద్దామని వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర పవన్‌కు కనపడటం లేదా అని ప్రశ్నించారు. 

పవన్‌ కళ్యాణ్ ఉద్ధానం, మూలలంక ప్రాంతాల్లో పర్యటించి ఏ సాంధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన నిలబడి టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం లేదా అని ఎద్దేవా చేశారు. పర్యటనల పేరుతో పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబుతో కలిసి డ్రామా ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. వారసత్వ రాజకీయాలపై తెగ స్పీచ్‌లిస్తున్న పవన్‌ సినిమాల్లోకి ఎలా వచ్చారనీ, ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి రాలేదా అని  ప్రశ్నించారు.

 వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం వైఎస్‌ జగన్‌ ఓదార్పుయాత్ర చేపట్టకుండా, కాంగ్రెస్‌ను వీడకుండా ఉంటే కేంద్రమంత్రి అయ్యేవారనీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యేవారని వ్యాఖ్యానించిన విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌ గుర్తుంచుకుంటే మంచిదని నాని హితవు పలికారు. పవన్ కళ్యాణ్‌ నిలకడలేని మనస్తత్వానికి ఆయన మాటలే నిదర్శనమని నాని ఎద్దేవా చేశారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే