సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టిన జగన్ సర్కార్

Published : Jan 20, 2020, 11:21 AM ISTUpdated : Jan 20, 2020, 07:06 PM IST
సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టిన జగన్ సర్కార్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సీఆర్‌డీఏ రద్దు బిల్లును ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం నాడు ప్రవేశపెట్టారు. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభం కాగానే ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి   సీఆర్‌డీఏ రద్దు బిల్లును అసెంబ్లీ ముందు ప్రవేశ పెట్టారు.

ఆ తర్వాత ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ   పాలన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారు.ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్టణం ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.  న్యాయ రాజధానిగా కర్నూల్ ఉంటుందని మంత్రి ప్రకటించారు.  ఏపీ రాష్ట్రంలో ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్టణం ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.  న్యాయ రాజధానిగా కర్నూల్ ఉంటుందని మంత్రి ప్రకటించారు.  ఏపీ రాష్ట్రంలో ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో  టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలే  ప్రయత్నం చేశారు.  ఈ సమయంలో చరిత్ర కూడ వినేందుకు కూడ  టీడీపీ సభ్యులు సిద్దంగా లేరని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
 

PREV
click me!

Recommended Stories

RK Roja Comments on Chandrababu Super Six: సూపర్ సిక్స్ – సూపర్ ప్లాప్ | Asianet News Telugu
నగరిలోచంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ | RK Roja Sensational Comments on Chandrababu | Asianet News Telugu