నేను మోదీతో చేతులు కలిపితే జగన్ సీఎం అయ్యేవాడా, వైసీపీ ఉండేదా: పవన్ కళ్యాణ్

By Nagaraju penumala  |  First Published Dec 3, 2019, 9:43 PM IST

151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన జగన్ కు నిజంగా అంత బలం ఉంటే విశాఖపట్నంలో తాను నిర్వహించిన లాంగ్ మార్చ్ కి అంత జనం వచ్చేవారే కాదన్నారు. లాంగ్ మార్చ్ తోనే జగన్ బలం ఎంతో తేలిపోయిందన్నారు పవన్ కళ్యాణ్. 
 


తిరుపతి: ప్రజలకు ఇచ్చిన మాట కోసం తాను ప్రధాని నరేంద్రమోదీతో చేతులు కలపలేదు కాబట్టే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాను గనుక బీజేపీతో చేతులు కలిపితే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారా అంటూ ప్రశ్నించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మాటిచ్చానని ఆ మాట తప్పలేకే తాను బీజేపీకి దూరమయ్యానని చెప్పుకొచ్చారు. అలా కాకుండా మోదీని కలిసి ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేనని చేతులు కలిపితే నేడు వైసీపీ పరిస్థితి ఏంటని నిలదీశారు. 

Latest Videos

undefined

మోదీతో చేతులు కలపలేదు కాబట్టే జగన్ సీఎం అయ్యారని చెప్పుకొచ్చారు. ఆశయాల కోసం కాకుండా తాను బీజేపీతో కలిస్తే వైసీపీ ఉండేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని తీవ్ర విమర్శలు చేశానని అలాంటిది ఆ పార్టీతో ఎలా కలుస్తానని చెప్పుకొచ్చారు. 

ఢిల్లీ కేంద్రంగా పవన్ వ్యూహం: జగన్ పై పవర్ అటాక్, డైరెక్షన్ వారిదేనా

రూ.30వేల కోట్లు పంచి టీడీపీ ఎన్నికల్లో ఓటమి పాలైందని ఆరోపించారు. మంగళగిరిలో తన సభను చూసిన తర్వాత టీడీపీకి ఓటమి ఖాయమైందని ఆనాడే టీడీపీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చేశారని చెప్పుకొచ్చారు. 

151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన జగన్ కు నిజంగా అంత బలం ఉంటే విశాఖపట్నంలో తాను నిర్వహించిన లాంగ్ మార్చ్ కి అంత జనం వచ్చేవారే కాదన్నారు. లాంగ్ మార్చ్ తోనే జగన్ బలం ఎంతో తేలిపోయిందన్నారు పవన్ కళ్యాణ్. 

గత ఎన్నికల్లో తాను ఆశయాల కోసం ఆలోచించానని అందువల్లే అధికారానికి దూరమయ్యానని తెలిపారు. జాతీయ మీడియాలో జగన్ రెడ్డి అని సీఎం జగన్మోహన్ రెడ్డిని పిలుస్తారని వాళ్లు పెద్దవాళ్లు కాబట్టి వైసీపీ వాళ్లకి కోపం రాదని తాను పిలిస్తే మాత్రం కోపం వస్తుందా అంటూ నిలదీశారు. 

పవన్ కాల్షీట్స్ ఇచ్చేశారు....బీజేపీలో జనసేన విలీనమే మిగిలింది...: పేర్ని నాని

తాను రాయలసీమలో పుట్టకపోయినా తనకు పౌరుషం ఉందని చెప్పుకొచ్చారు. రాయలసీమలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నారు. కొంతమంది నాయకులు ప్రజలు తమ మోచేతి నీళ్లు తాగి బతకాలని కోరుకుంటున్నారని విమర్శించారు. 

వైసీపీ నేతలు, ఇతర నాయకులు అమాయక ప్రజలను వేధిస్తే సమించేది లేదని హెచ్చరించారు. ఒకవేళ తాడోపేడో తేల్చుకుందామని 151 మంది ఎమ్మెల్యేలు వస్తే తాను ముందే ఉంటానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 

మొండోడు, జగన్ కులానికే మానవత్వమా: పవన్

click me!