అలా ప్రచారం చేస్తే జనసేనదే విజయం: ఎలక్షన్ స్ట్రాటజీ చెప్పిన పవన్ కళ్యాణ్

By Nagaraju TFirst Published Jan 5, 2019, 6:32 PM IST
Highlights

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు పార్టీ పటిష్టతపైనా దృష్టి సారించారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎలా ప్రచారం చెయ్యాలో కార్యకర్తలకు హితబోధ చేశారు పవన్. 

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు పార్టీ పటిష్టతపైనా దృష్టి సారించారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎలా ప్రచారం చెయ్యాలో కార్యకర్తలకు హితబోధ చేశారు పవన్. 

జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని ఒకసారి వైసీపీతో పొత్తు పెట్టుకుంటుందని మరోసారి ఇలా ప్రచారం జరుగుతోంది. పొత్తులు ఉండవని తాము వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని పవన్ స్పష్టం చెయ్యడంతో ఆ ప్రచారం కాస్త బెడిసి కొట్టింది అధికార ప్రతిపక్ష పార్టీలకు. 

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేస్తే జగన్ కు వచ్చే ఇబ్బంది ఏంటి అని ప్రశ్నిస్తూ ఓ బాంబు పేల్చారు. గతంలో తెలుగుదేశం పార్టీతో  పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఈసారి కూడా పెట్టుకుంటారా అన్న సందేహం ప్రజల్లో కలిగేలా చేశారు. మరోవైపు కొందరు టీడీపీ కీలక నేతలు వైసీపీ, జనసేనల మధ్య పొత్తు ఖరారైపోయిందని ప్రచారం చేశారు. 

అటు వైసీపీ మాత్రం జనసేన, టీడీపీ ఇద్దరూ మిత్రులేనని ఒకప్పుడు బహిరంగ మిత్రులు అని ఇప్పుడు రహస్య మిత్రులంటూ విమర్శించింది. అంతేకాదు టీడీపీకి, జనసేనకు ఫైనాన్షియర్ లింగమనేని ఒక్కరేనని దీన్ని బట్టి చూస్తే టీడీపీ జనసేనల మధ్య రహస్య బంధం ఏంటో తెలుస్తుందని ఆరోపించింది. 

ఇలా ఇరుపార్టీలు మైండ్ గేమ్ ఆడటాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పసిగట్టారు. తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తాము వామపక్ష పార్టీలతో కలిసి వెళ్తామని చెప్పుకొచ్చారు. 175 స్థానాల్లో పోటీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారం వల్ల జనసైనికులు ఆందోళన చెందొద్దంటూ హితవు పలికారు. 

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అమరావతి పార్టీ కార్యాలయంలో చిత్తూరు పార్టీ నేతల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని స్పష్టం చేశారు. 

జనసేన పార్టీ అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని జనసేనకు లేదన్నారు. జనసేన పార్టీ ప్రారంభదశలో ఉందన్నారు. సంస్థాగతంగా పార్టీ పటిష్టతకు మరికొంత సమయం పడుతుందని పవన్ తెలిపారు. 

2014లో జనసేన పార్టీ అండదండలతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో రెండు పార్టీలు మనతో కలిసి వస్తాయనే ప్రచారం చేయ్యాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలా ప్రచారం చేసుకోవడం వల్ల మన విజయం మరింత సులభతరం అవుతుందన్నారు. మైండ్ గేమ్ వాళ్లకేనా మనకు తెలియదా అంటూ పవన్ కళ్యాణ్ తన స్ట్రాటజీని బయటపెట్టారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నేనూ ఉన్నా: చిరంజీవి ప్రజారాజ్యంపై పవన్ సంచలన వ్యాఖ్యలు

ఆ పార్టీతోనే మా పొత్తు: పవన్ కళ్యాణ్ స్పష్టత

click me!