9న పాదయాత్ర ముగింపు: ఆ తర్వాత జగన్ కీలక నిర్ణయం

By Nagaraju TFirst Published Jan 5, 2019, 4:37 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతోపాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు. 
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతోపాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో పాదయాత్ర పూర్తి చేసుకోబోతుంది. జనవరి 9న వైఎస్ జగన్ తన పాదయాత్రకు ముగింపు పలకనున్నారు. జగన్ ఊహించినట్లుగానే ప్రజా సంకల్పయాత్ర ఆ పార్టీకి మాంచి మైలేజ్ తీసుకువచ్చింది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. 

ఏడాది కాలంగా జరగుతున్న ఈ పాదయాత్రపై తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇకపోతే పాదయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచిపోయేలా వైఎస్ జగన్ నిర్వహించాలని యోచిస్తున్నారు. 

పాదయాత్ర ముగిసిన తర్వాత వైఎస్ జగన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారా లేక బస్సు యాత్రకు శ్రీకారం చుడతారా ఏం చేస్తారా అంటూ ప్రజల్లో జోరుగా చర్చ  జరుగుతోంది. 

ఇప్పటికే ఎన్నికల వేడి పొగలు సెగలు కక్కుతుండటంతో వైఎస్ జగన్ అధికార పార్టీ తెలుగుదేశం, విపక్ష పార్టీ జనసేనను ఢీ కొట్టే అంశాలపై వ్యూహరచన చేస్తారా అంటూ అంతా వేచి చూస్తున్నారు.  

అయితే వైఎస్ జగన్ పాదయాత్ర తర్వాత కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్రను ఘనంగా ముగించనున్న జగన్ ఆ తర్వాత అమరావతిలో మకాం పెట్టాలని భావిస్తున్నారట. 

అమరావతి రాజధాని పరిధిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కృష్ణానది ఒడ్డున తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం దాదాపుగా పూర్తి కావస్తుంది. ఇక్కడ వైఎస్ జగన్ నివాసం కూడా ఉండనుంది. 

పాదయాత్ర అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్ లో కేవలం పదిరోజులు మాత్రమే ఉంటారని తెలిసింది. ఆ తర్వాత ఆయన కుటుంబంతో కలిసి తాడేపల్లికి వచ్చేస్తారని ప్రచారం. హైదరాబాద్ వేదికగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం భావ్యం కాదని నిర్ణయించుకున్న వైఎస్ జగన్ ఏపీలోనే రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

click me!