తోలు తీస్తారు, గుర్తు పెట్టుకో: చంద్రబాబుకి పవన్ కల్యాణ్ వార్నింగ్

First Published Jul 28, 2018, 2:55 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ మీడియాతో మాట్లాడుతూ..నేను పాదయాత్ర చేస్తుంటే పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని.. సీఎం ఆదేశాల మేరకే వారు అలా చేస్తున్నారని పవన్ ఆరోపించారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ మీడియాతో మాట్లాడుతూ..నేను పాదయాత్ర చేస్తుంటే పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని.. సీఎం ఆదేశాల మేరకే వారు అలా చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ప్రజాపోరాటయాత్రలో భాగంగా నేను శ్రీకాకుళం జిల్లాలో పర్యటించినప్పుడు నాకు పోలీసుల భద్రత ఇవ్వలేదని గుర్తుచేశారు.

పర్యావరణం ఎలా నాశనమవుతుందో పశ్చిమగోదావరి జిల్లాను చూస్తే అర్థమవుతుందని అన్నారు. రైతు సమాజంలో కనిపించే దేవుడని.. నాడు రాజధాని భూసేకరణ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడినప్పుడు 1850 ఎకరాల్లోనే రాజధాని అన్నారని.. అది కూడా అటవీ ప్రాంతంలోనే తీసుకోవాలని చర్చకు వచ్చిందని కానీ నేడు రాజధాని లక్ష ఎకరాలకు చేరిందని అన్నారు. అమరావతిని అడ్డుకుంటామని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. మహారాష్ట్ర రైతుల మాదిరిగా ఆందోళనకు దిగి చంద్రబాబు ఇంటి ముందు బైఠాయిస్తామని చెప్పారు. తనకు ప్రజలను కదిలించే సత్తా ఉందని అన్నారు. 

బాధ్యతాయుత అభివృద్ధి చేయలేరా లేదంటే అడిగేవాళ్లు లేరనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.. ప్రజలు తోలు తీస్తారని.. గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. తనను డబ్బుతో తనను కొనలేరని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

click me!