కిడ్నీ కష్టాలు... పవనన్నా డెడ్ లైన్ ముగిసిందే!

First Published Jan 6, 2017, 11:43 AM IST
Highlights

ఉద్ధానం కిడ్నీ రోగాల మీద స్పందించాలని పవన్ కల్యాణ్ పెట్టిన డెడ్ లైన్ ముగిసింది. 

 

డెడ్ లైన్ ముగిసింది.

 

 ఆవేశం వూగిపోతూ, సానుభూతితో తడిచిపోతూ ఉద్దానం కిడ్నీ రోగులకు ఏంచేస్తారో   48 గంటల్లో చెప్పండని పవర్ స్టార్ విధించిన డెడ్  లైన్  ముగిసింది.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం  శ్రీకాళం జిల్లా లో పర్యటిస్తూ కిడ్నీ రోగులకు వరాలు కురపించారు.

 

ఇక  పవన్  ఏమి చెబుతాడో చూడాలి.

 

ఉద్ధానం కిడ్నీ బాధితులను కలుసుకుని, వారి కష్టాలు విని, చలించి, నేనున్నానని మాట ఇచ్చి, 48 గంటల డెడ్ లైన్ విధించిన సంగతి ఎవరికైనా గుర్తుందా?

 

 గుర్తు లేని వాళ్ల కోసం : జనవరి మూడో తేదీన ఉధ్దానంలో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ ప్రాంతంలో అంతుచిక్కని  కిడ్నీ జబ్బుతో ప్రజలు బాధ పడుతున్నారని విని ఆవేదనతో అక్కడికి వచ్చారు.  ఈ జబ్బుపడి, బాధపడ్తున్నవారిని, జబ్బు బారిన పడి చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. కొంత మంది డాక్టర్లను సంప్రదించారు. ఏమయిందో ఏమో,  ఆ వెంటనే ఆవేశంగా  వూగిపోతూ,, కిడ్ని బాధితుల మీద స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధించారు. ఈ గడువు నిన్నటితో ముగిసింది.

 

 

పార్టీ తరఫున ఒక నివేదిక తయారుచేయించుకుని, దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దగ్గరికి  స్వయంగా తీసుకెళ్తానని ప్రకటించారు.

 

పవన్ కల్యాణ్ పర్యటన అనగానే, మీటింగ్ కు ముందు, వెనక ఎంత హంగామా ఉంటుందో. 

 

పవన్ వెళ్లాక ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ హడావిడిగా ఒక  ప్రెస్ కాన్ఫరెన్ష్ పెట్టారు. డాక్టర్లతో మాట్లాడారు. ఉద్దానం కిడ్ని సమస్యను పరిష్కరించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  స్పందనేమిటో తెలుసా.  ఉద్ధానం వంటి సమస్య చర్చించేందుకు  సైన్స్ కాంగ్రెస్ వంటి సభలు  వేదిక కావలన్నారు. అంతర్జాతీయస్థాయిలో పరిష్కార అన్వేషణ జరగాలని అన్నారు. ఈ   విషయాన్ని గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పచెప్పారు.  

 

శ్రీకాకుళం పర్యటనకొచ్చిన ముఖ్యమంత్రి  కిడ్నీ బాధితులకు పెన్షన్ ప్రకటించడంతో పాటు, విశాఖ వచ్చే రోగులకు బస్ పాస్ లిస్తామని కూడా చెప్పారు.

 

అంతేకాదు,కిడ్నీ సమస్య ఉన్న ప్రాంతాలకు  కుప్పం తరహాలో మంచినీటి సరఫరా ఏర్పాటుచేస్తామని హమీ ఇచ్చారు.

 

పవన్ అడిగింది ఇదేనా.. ఇంకా ఏమయినా ఉన్నాయా?

 

 

 

 

 

 

click me!