శ్రీవారి పవిత్రోత్సవానికి ఏర్పాట్లు

Published : Jul 25, 2017, 07:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
శ్రీవారి పవిత్రోత్సవానికి ఏర్పాట్లు

సారాంశం

ఆగస్టు 2వ తేదీన పవిత్రోత్సవాలకు అంకురార్పణ  తిరుమలలో  ప్రవేశపెట్టిన సంస్కరణలు సత్పలిస్తున్నాయన్న జేఈవో  

 
తిరుమలలో  వేంకటేశ్వర స్వామి  పవిత్రోత్సవాలకు ఆగస్టు 3 నుండి  5 వ తేదీ వరకు నిర్వహించనున్నారు.   ఆగస్టు 2వ తేదీన పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరపనున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. దీని కోసం దేవాలయ అదికారులు అప్రమత్తం కావాలని, భక్తులకు ఏ లోటు రాకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.     
ఆయన మీడియాతో మాట్లాడుతూ..తిరుమలలో ఇటీవల ప్రవేశపెట్టిన సంస్కరణలు సత్పలితాలనిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే భక్తులకు గదులు కేటాయించే అంశంలో నూతన విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలియజేసారు.  దీని వల్ల భక్తులకు ఇబ్బందుల తొలగిపోయాయన్నారు. అలాగే నడకదారి  టోకెన్లలో టైం స్లాట్ విధానాన్ని అవలంభించడం వల్ల భక్తులు క్యూలైన్లలో వేచివుండాల్సిన శ్రమను తగ్గించామన్నారు. దీనికి  భక్తుల్లో నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. దీనివల్ల నడకదారి భక్తులు గంటలోపే స్వామి వారిని దర్శించుకుంటున్నారని జేఈవో తెలిపారు.
 క్యూలైన్లలో తెచ్చిన మార్పుల వల్ల కూడా తోపులాటలు నివారించగలిగామని,అందువల్ల భక్తులు శ్రీవారిని గందరగోళం లేకుండా ప్రశాంతంగా దర్శించుకుంటున్నారని జేఈవో తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్